మెగాస్టార్ అనే బిరుదుకు గౌరవం తెచ్చిన వ్యక్తి చిరంజీవి. అందుకే.. మెగాస్టార్ అనేది ఒక బ్రాండ్ ఇమేజ్, ఇండస్ట్రీకి ఒక పిల్లర్. ఆ టైటిల్ ను పలకాలంటే చిరంజీవి అభిమాని అయ్యుండాలి. పలకాలంటేనే అభిమాని అయ్యుండాలంటే, ఆ గుర్తింపును పేరుకు ముందు పెట్టుకోవాలంటే ఇంకెంతటి స్థాయిలో కష్టపడాలో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే.. కావాలని చేశారో లేక పొరపాటున జరిగిందో తెలియదు కానీ.. ఆహా యాప్ స్పెషల్ ప్రోమోలో అల్లు అర్జున్ కి డైరెక్ట్ గా మెగాస్టార్ అని బిరుదు ఇచ్చేసారు.
ఈ విషయమై గత కొన్ని రోజులుగా పెద్ద రచ్చ జరుగుతొంది. మెగా అభిమానుల్లోనే గ్రూపులు కూడా క్రియేట్ అయిపోయాయి. అల్లు అర్జున్ ఫ్యాన్స్ & చిరంజీవి ఫ్యాన్స్ ఒకర్నొకరు తిట్టుకొనే స్థాయికి వెళ్లిపోయారు. అయితే.. అది ఫేక్ ఎడిట్ అని కవర్ చేస్తూ స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్ అందరూ టాపిక్ ని డైవర్ట్ చేస్తుండగా, వాళ్ళ మీద బాంబు పేలుస్తూ “పొరపాటున పెట్టాం, క్షమించండి” అని ట్వీట్ చేసి, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కవరింగ్ ని అబద్ధం అని తేల్చి పడేసారు.
దాంతో స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్ అందరూ దెబ్బకి సైలెంట్ అయిపోయారు. ఇకపోతే.. మెగాస్టార్ అంటే చిరంజీవి మాత్రమేనని, ఇంకెవరూ ఆ టైటిల్ కు అర్హులు కారని కాలరెగరేస్తున్నారు మెగా ఫ్యాన్స్. అదండీ సంగతి.. ఒక్క ట్వీట్ తో కథ మొత్తం అడ్డం తిప్పేసింది ఆహా టీమ్.
Most Recommended Video
2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!