పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలయికలో తెరకెక్కుతున్న ‘భీమ్లా నాయక్’ చిత్రం కోసం పవన్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ కు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కింది. సాగర్ చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ సంభాషణలు సమకూర్చడంతో పాటు స్క్రిప్ట్ లో చాలా మార్పులు చేశారని నిర్మాత సూర్య దేవర నాగ వంశీ చెప్పుకొచ్చారు.
ఫిబ్రవరి 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ అదిరిపోయే రేంజ్లో జరుగుతుంది. థియేట్రికల్ రైట్స్ ఇప్పటికే సాలిడ్ రేటుకి అమ్ముడుపోయాయి. ఓవర్సీస్ లో బుకింగ్స్ పీక్స్ లో ఉన్నాయి. ఇక నాన్-థియేట్రికల్ రైట్స్ కు కూడా భారీ పోటీ నెలకొంది. ముఖ్యంగా డిజిటల్ రైట్స్ కు భారీ రేటు పలుకుతుంది.’భీమ్లా నాయక్’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్’ వారు సొంతం చేసుకున్నట్టు మొన్నటి వరకు ప్రచారం జరిగింది.
అయితే తాజా సమాచారం ప్రకారం… ‘భీమ్లా నాయక్’ పోస్ట్ థియేట్రికల్ హక్కులను ప్రఖ్యాత ‘ఆహా’ వారు కూడా సొంతం చేసుకున్నారట. ప్రస్తుతం ‘ఆహా’ లీడింగ్ ఓటిటి ప్లాట్ ఫామ్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అలాంటి సంస్థ చేతికి ‘భీమ్లా నాయక్’ డిజిటల్ రైట్స్ వెళ్ళడం విశేషం. సినిమా రిలీజ్ అయిన 3 వారాలు లేదా 30 రోజుల వరకు పెద్ద సినిమాలు ఓటిటిలో రిలీజ్ కావు. ‘భీమ్లా నాయక్’ కనుక సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంటే 6 వారాలు లేదా 50 రోజుల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ ఉంటుంది.
Most Recommended Video
ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!