Aishwarya Rajesh: ‘సంక్రాంతికి వస్తున్నాం’.. భాగ్యం రోల్ గురించి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టిన ఐశ్వర్య రాజేష్!

వెంకటేష్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమా రెండు రోజుల క్రితం సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యింది.మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని భారీ వసూళ్లు సాధిస్తుంది ఈ సినిమా. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాత. ఇక ప్రమోషన్ లో భాగంగా హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ తన పాత్ర గురించి ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

Aishwarya Rajesh

విషయం ఏంటంటే.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో ఐశ్వర్య రాజేష్.. హీరో వెంకటేష్ కి భార్య పాత్రలో కనిపించింది. భాగ్యలక్ష్మీ అలియాస్ భాగ్యం అనే పాత్రలో ఈ అమ్మడు జీవించేసింది అని చెప్పాలి. భార్య మాజీ ప్రియురాలిపై కోపంతో ఊగిపోతూనే కామెడీ కూడా పండించింది. ఇంత వెయిట్ ఉన్న పాత్రకి ఐశ్వర్య రాజేష్ ఫస్ట్ ఆప్షన్ కాదట. ఎందుకంటే ముందుగా.. ముగ్గురు హీరోయిన్లని భాగ్యం పాత్ర కోసం అప్రోచ్ అయ్యాడట దర్శకుడు అనిల్ రావిపూడి.

అయితే ఆ ముగ్గురు హీరోయిన్లు ఈ పాత్రని రిజెక్ట్ చేశారట. వాళ్ళు రిజెక్ట్ చేయడానికి కారణం.. భాగ్యం అనే పాత్ర నలుగురు పిల్లల తల్లి కావడమే అని చెప్పాలి. అవును నలుగురు పిల్లల తల్లి పాత్ర చేస్తే.. తర్వాత అన్నీ అలాంటి పాత్రలే వస్తాయేమో, తమ కెరీర్ దెబ్బ తింటుందేమో అనే ఉద్దేశంతో ఆ హీరోయిన్లు రిజెక్ట్ చేసినట్టు… ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఐశ్వర్య రాజేష్ చెప్పుకొచ్చింది.

‘పిల్లలకు తల్లిగా నటించడం అనేది రిస్క్ కాదని.. మంచి అవకాశం అని మరో హీరోయిన్ మీనాక్షి కూడా ‘లక్కీ భాస్కర్’ లో ఒక పిల్లాడికి తల్లిగా చేసిందని..అయినా ఆమె టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుందని’ ఐశ్వర్య రాజేష్ చెప్పుకొచ్చింది.

ఆఫర్లు లేవు.. 8 నెలలు ఖాళీగా ఉన్నాను.. సీనియర్ హీరో సురేష్ ఎమోషనల్ కామెంట్స్!

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus