Aishwarya Rajesh: వైరల్ అవుతున్న ఐశ్వర్యా రాజేశ్ సంచలన వ్యాఖ్యలు!

Ad not loaded.

టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్లలో ఐశ్వర్యా రాజేశ్ ఒకరు. ఎంతో టాలెంట్ ఉన్న ఈ హీరోయిన్ ఒకవైపు హీరోలకు జోడీగా నటిస్తూనే మరోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో సైతం నటిస్తూ సత్తా చాటుతున్నారు. తెలుగులో కూడా ఈ బ్యూటీకి ఎక్కువగానే ఆఫర్లు వస్తున్నాయి. ఫర్హానా సినిమాతో త్వరలో ఈ బ్యూటీ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఐశ్వర్యా రాజేశ్ కు ఫిమేల్ సెంట్రిక్ సినిమాలలో ఎందుకు ఎక్కువ నటిస్తున్నారనే ప్రశ్న ఎదురైంది.

ఆ ప్రశ్నకు ఐశ్వర్యా రాజేశ్ ఒకింత ఘాటుగా బదులిచ్చారు. మీరు ఇదే ప్రశ్న హీరోలను కూడా అడగగలరా అని ఆమె ఘాటుగా బదులిచ్చారు. కెరీర్ తొలినాళ్లలో నేను తల్లి పాత్రలో నటించానని ఎలాంటి పాత్రలో అయినా నేను నటించగలనని ఐశ్వర్యా రాజేశ్ పేర్కొన్నారు. ఒకవైపు కమర్షియల్ సినిమాలలో నటిస్తూనే మరోవైపు ఇతర ప్రాజెక్ట్ లలో కూడా నటిస్తున్నానని ఆమె అన్నారు. కరోనా సమయంలో నేను గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలు ఇప్పుడు వరుసగా విడుదల అవుతున్నాయని ఆమె వెల్లడించడం గమనార్హం.

నేను నటించిన సినిమాలు ఆలస్యంగా రిలీజ్ అవుతున్నాయని ఆమె చెప్పుకొచ్చారు. తమ ఇంట్లో మనిషిలా ప్రేక్షకులు చూస్తున్నారని ఆమె అన్నారు. ఐశ్వర్యా రాజేశ్ రెమ్యునరేషన్ కూడా భారీ రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది. ఐశ్వర్యా రాజేశ్ కెరీర్ పరంగా మరింత ఎదగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అభినయ ప్రధాన పాత్రలకు ఈ బ్యూటీ ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు.

ఐశ్వర్యా రాజేశ్ (Aishwarya Rajesh) ఫర్హానాతో సక్సెస్ ను సొంతం చేసుకోవడంతో పాటు తెలుగు ప్రాజెక్ట్ లకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఐశ్వర్యా రాజేశ్ కు టాలెంట్ వల్లే ఈ స్థాయిలో ఆఫర్లు దక్కుతున్నాయని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమా సినిమాకు ఐశ్వర్య రేంజ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus