Aishwarya Rajesh: నేను నటించే సినిమాలకు స్పెషాలిటీ ఉండాలి!

  • May 9, 2023 / 08:12 PM IST

ఐశ్వర్య రాజేష్ పరిచయం అవసరం లేని పేరు తెలుగులో పలు సినిమాలలో నటించిన ఐశ్వర్య రాజేష్ అచ్చ తెలుగు అమ్మాయి అయినప్పటికీ ఈమె పుట్టి పెరిగింది మాత్రం చెన్నైలో కావటం వల్ల ఎక్కువగా తమిళ సినిమాలలో నటిస్తూ ప్రస్తుతం ఇండస్ట్రీలోనే ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వరుసగా తమిళ సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే ఈమె నటించిన ఫర్హాన్ అనే తమిళ చిత్రం హిందీలోనూ తెలుగులో కూడా ఈ నెల 12వ తేదీ విడుదల కానుంది.

ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కానున్న నేపథ్యంలో ఐశ్వర్య రాజేష్ హైదరాబాదులో ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నటి ఐశ్వర్య రాజేష్ తన సినిమాల గురించి ఎన్నో విషయాలను తెలియజేశారు. ముఖ్యంగా గత కొంతకాలంగా ఈమె తెలుగు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండడానికి గల కారణాలను కూడా తెలియజేశారు. ఈ సందర్భంగా ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ తాను గత కొంతకాలంగా తెలుగు సినిమాలకు ఎందుకు దూరంగా ఉన్నాను అనే ప్రశ్నలు ఎదురవుతూ ఉన్నాయని తెలియజేశారు.

అయితే తనకు తెలుగులో సినిమా అవకాశాలు వస్తున్నాయని కానీ ఆ పాత్రలో తనకు ఏమాత్రం నచ్చకపోవటం వల్లే ఆ సినిమా అవకాశాలను వదులుకోవాల్సి వస్తుందని అందుకే తెలుగు సినిమాలకు దూరమయ్యానంటూ ఈ సందర్భంగా సమాధానం చెప్పారు. ఇక తాను ఏదైనా ఒక సినిమాలో నటిస్తే ఆ సినిమా కంటూ ఓ ప్రత్యేకత ఉండాలని అలాంటి స్పెషల్ పాత్రలలోనే తాను నటించడానికి ఇష్టపడతాను అంటూ ఐశ్వర్య రాజేష్ తెలియజేశారు.

తాను (Aishwarya Rajesh) నటించే ఏ సినిమాలోనైనా తన పాత్రకు ఉన్నటువంటి ప్రాధాన్యత గురించి ఆలోచిస్తానని పాత్రకు ఏ మాత్రం ప్రాధాన్యత లేని సినిమాలలో తాను నటించనని తెలిపారు.అయితే తెలుగులో నాకు ఎక్కువగా ఇలాంటి అవకాశాలే వచ్చాయి. అందుకే ఇలాంటి పాత్రలకు కమిట్ అవ్వకుండా పూర్తిగా ఆ సినిమాలను రిజెక్ట్ చేస్తున్నానని అందుకే తెలుగు సినిమాలు చేయట్లేదని తెలియజేశారు. ప్రస్తుతం తెలుగు సినిమాల గురించి ఈమె చేసిన ఈ కామెంట్స్ పైరల్ అవుతున్నాయి.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus