పుట్టిన రోజు కానుక ఇచ్చిన ఐశ్వర్య

ఐశ్వర్య రాజేష్‌ ఈ రోజు 31వ పుట్టిన రోజు జరుపుకుంటోంది. దీంతో అభిమానులు ఆమెకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు. సోషల్‌ మీడియాలో ఐశ్వర్య పేరును మారుమోగిస్తున్నారు. ఇంత ప్రేమ చూపిస్తున్న అభిమానులకు ఐశ్వర్య ఓ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. నటిగా గుర్తింపు దక్కే పాత్రలు చేస్తూ వస్తున్నా… ఇంకా సరైన బ్రేక్‌ దక్కలేదు ఐశ్వర్యకు. సరైన హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమా పడితే ఐశ్వర్య గొప్పతనం తెలుస్తుందని చాలామంది అంటుంటారు. ఈ పుట్టిన రోజుకు ఐశ్వర్య ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్‌ కూడా అదే.

ఐశ్వర్య ప్రధాన పాత్రలో ఓ హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమా ప్లానింగ్‌లో ఉందని కొన్ని రోజుల క్రితం వార్తలొచ్చాయి. అయితే ఆ తర్వా పెద్దగా ఆ ఊసులు వినపడలేదు. ఈ రోజు ఆ సినిమా ప్రకటించేసింది ఐశ్వర్య. ‘డ్రైవర్‌ జమున’ పేరుతో తర్వాతి సినిమా ఉంటుందని ట్విటర్‌ వేదికగా ప్రకటించేసింది ఐశ్వర్య. ‘వతికుచి’ ఫేమ్‌ కిన్‌స్లిన్‌ దర్శకత్వంలో నాయికా ప్రాధాన్య చిత్రంగా ఈ సినిమా రూపొందనుంది. ‘డ్రైవర్‌ జమున’లో ఐశ్వర్య… జమున అనే క్యాబ్‌ డ్రైవర్‌గా కనిపించబోతోంది.

చెన్నై నరగంలో క్యాబ్‌ నడుపుతున్న ఓ అమ్మాయికి.. అనుకోని సంఘటన జరుగుతుంది. అది ఆమె జీవితంలో ఎలాంటి మలుపు తిప్పింది అనేదే సినిమా కథ. భావోద్వేగాల సమ్మిళితంగా సినిమా రూపు దిద్దుకోబోతోందట. ప్రస్తుతం ఐశ్వర్య చేతిలో మరో సినిమా కూడా ఉంది. కార్తిక్‌ సుబ్బరాజు నిర్మాణంలో ‘భూమిక’ అనే చిత్రంలో నటిస్తోంది. తెలుగులో నాని సరసన ‘టక్‌ జగదీష్‌’లో నటిస్తోంది. మరోవైపు ‘అయ్యప్సన్‌ కొషియమ్‌’ తెలుగు రీమేక్‌లో కూడా నటిస్తోందని వార్తలొస్తున్నాయి.

Most Recommended Video

క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
అల్లు అర్జున్ నుండి నాగ చైతన్య వరకు.. అందమైన స్టార్ కాపుల్స్.. సతీమణులే స్పెషల్ ఎట్రాక్షన్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus