Ajay Devgn: ‘ఆర్.ఆర్.ఆర్’ కి ఆస్కార్ రావడం పై అజయ్ దేవగన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం రిలీజ్ అయ్యి నేటితో ఏడాది పూర్తి చేసుకుంటుంది. ఈ చిత్రంలోని ‘నాటు నాటు’ పాటకు.. 95th అకాడమీ అవార్డ్స్ వేడుకలో ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ కేటగిరీలో నేషనల్ అవార్డు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ ఫీట్ సాధించిన మొదటి భారతీయ చిత్రంగా చరిత్రకెక్కింది. ఇదిలా ఉండగా.. ఈ చిత్రంలో రామరాజు అంటే రాంచరణ్ పాత్రకు తండ్రి పాత్రలో అజయ్ దేవగన్ కనిపిస్తాడు.

అతని పాత్ర 15 నిమిషాల వరకు ఉంటుంది. అయితే తాజాగా ఇతను.. ‘ ‘ఆర్.ఆర్.ఆర్’ ఆస్కార్ గెలుచుకోవడానికి ముఖ్య కారణం నేనే’ అంటూ చేసిన కామెంట్లు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అయ్యాయి. అజయ్ దేవగన్ ఇలా ఎందుకు అన్నాడు అంటూ చాలా మంది ఆశ్చర్యపోయారు. ఇక మేటర్ లోకి వెళ్తే.. అజయ్ దేవగన్ హీరోగా నటించిన ‘భోళా’ చిత్రం మార్చ్ 30న విడుదల కాబోతోంది. ఇది లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ‘ఖైదీ'(2019) కి రీమేక్.

అయితే ఈ చిత్రం ప్రమోషన్లో భాగంగా ‘ది కపిల్ శర్మ’ టాక్ షోకి అజయ్ దేవగన్ (Ajay Devgn) హాజరయ్యాడు. ఈ క్రమంలో ‘ఆర్.ఆర్.ఆర్’ ఆస్కార్ గెలుచుకోవడం పై అజయ్ కు ఓ ప్రశ్న ఎదురైంది.దీనిపై స్పందించిన అజయ్.. ” ‘నా వల్లే ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రానికి ఆస్కార్ లభించింది. ఎందుకంటే ‘నాటు నాటు’ పాటకు నేను డాన్స్ చేసి ఉంటే ఏమై ఉండేది?’ అంటూ ఫన్నీ ఆన్సర్ ఇచ్చాడు. దీంతో అక్కడి వారంతా ఒక్కసారిగా గట్టిగా నవ్వేశారు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus