Ajay Devgn: దేవుడా.. అజయ్ దేవగణ్ కొత్త ఫ్లాట్ ఖరీదు అన్ని రూ.కోట్లా?

బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న హీరోలలో అజయ్ దేవగణ్ ఒకరు. కథ నచ్చితే టాలీవుడ్ సినిమాలలో నటించడానికి కూడా అజయ్ దేవగణ్ ఇష్టపడతారనే సంగతి తెలిసిందే. తాజాగా అజయ్ దేవగణ్ కొత్త ఫ్లాట్ ను కొనుగోలు చేయడం గమనార్హం. ఆఫీస్ కోసం అజయ్ దేవగణ్ ఈ ఫ్లాట్ ను కొనుగోలు చేశారని సమాచారం అందుతోంది. 13,293 చదరపు అడుగుల విస్తీర్ణంతో అజయ్ దేవగణ్ ఈ ఫ్లాట్ ను కొనుగోలు చేసినట్టు భోగట్టా.

45 కోట్ల రూపాయలు ఖర్చు చేసి అజయ్ దేవగణ్ ఈ ఫ్లాట్ ను కొనుగోలు చేసినట్టు సమాచారం అందుతోంది. 16, 17 అంతస్తులలో అజయ్ దేవగణ్ రెండు ఆఫీస్ యూనిట్లను కొనుగోలు చేశారు. 16వ అంతస్తు ఆస్తుల విలువ 30 కోట్ల రూపాయలు కాగా 17వ అంతస్తు ఆస్తుల విలువ 14.74 కోట్లు ఉందని సమాచారం అందుతోంది. ఈ ఫ్లాట్స్ కోసం అజయ్ దేవగణ్ భారీ మొత్తంలో స్టాంప్ డ్యూటీ చెల్లించారని భోగట్టా.

ఒక్కో సినిమాకు అజయ్ దేవగణ్ రెమ్యునరేషన్ 40 కోట్ల రూపాయల నుంచి 50 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అజయ్ దేవగణ్ కు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అజయ్ దేవగణ్ వయస్సు 54 సంవత్సరాలు అయినా ఫిట్ గా కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.

ప్రస్తుతం అజయ్ దేవగణ్ (Ajay Devgn) మైదాన్ అనే సినిమాలో నటిస్తున్నారు. అమిత్ శర్మ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. అజయ్ దేవగణ్ కు సోషల్ మీడియాలో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. సరైన కథలను ఎంచుకుంటే అజయ్ దేవగణ్ రేంజ్ అంతకంతకూ పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. అజయ్ దేవగణ్ ను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus