బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో ఎలిమినేషన్ ట్విస్ట్ అదిరింది. ఈవారం మొత్తం ఐదుగురు నామినేషన్స్ లో ఉండగా వాళ్లలో అజయ్ ఎలిమినేట్ అయినట్లుగా సమాచారం తెలుస్తోంది. ఈవారం అఖిల్, అషూరెడ్డి, అనిల్, అజయ్ ఇంకా హమీదాలు నామినేషన్స్ లో ఉన్నారు. వారిలో అఖిల్ టాప్ లో ఉండగా అనిల్ సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. అన్ అఫీషియల్ పోలింగ్ సైట్స్ ప్రకారం అఖిల్ కి 40 శాతం వరకూ ఓటింగ్ జరిగింది. చాలాకాలం తర్వాత అఖిల్ కి ఇంత ఎక్కువ ఓటింగ్ రావడం అనేది జరిగింది. అందుకే, అజయ్ కి ఇంకా అషూరెడ్డికి ఇద్దరికీ కూడా ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గిపోయింది.
వీళ్లతో పాటుగా ఉన్న హమీదా తన గేమ్ తోనే ప్రేక్షకులని ఆకట్టుకుంది. అందుకే, 18శాతం వరకూ ఓటింగ్ ని ప్రభావితం చేసి మూడో స్థానంలో ఉంది. అజయ్, ఇంకా అషూరెడ్డిలు ఫస్ట్ డే నుంచీ డేంజర్ జోన్ లోనే ఉన్నారు. ముఖ్యంగా అజయ్ అషూకంటే కూడా తక్కువ ఓటింగ్ లో ఉన్నాడు. కానీ, చివరి రెండు రోజులు అజయ్ కి అఖిల్ ఫ్యాన్స్ ఓట్లు వేశారు. అయితే, అఖిల్ కి ఇంకా అజయ్ కి వచ్చిన కొన్ని క్లాషెష్ వల్ల చివరిలోజు కొద్దిగా ఓటింగ్ తగ్గిపోయింది. అషూరెడ్డికి కొద్దిగా పెరిగింది.
దీంతో అజయ్ ఎలిమినేషన్ అవ్వాల్సి వచ్చింది. అజయ్ హౌస్ లో ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచీ పెద్దగా టాస్క్ లో పెర్ఫామ్ చేసింది లేదు. అలాగే, ఎవరితోనూ లాజికల్ గా మాట్లాడింది లేదు. బిందుమాధవిని అఖిల్ కోసం ఎదిరించినా, అందులో ఆడియన్స్ కి లాజిక్ కనిపించలేదు. అలాగే, మిగతా హౌస్ మేట్స్ తో కూడా పెద్దగా కలవలేదు. కేవలం అఖిల్ తో పాటే ఉన్నాడు. స్రవంతి-అజయ్-అఖిల్ – అషూ ఒక గ్రూప్ గా ఫస్ట్ వీక్ నుంచీ మారారు. ఏది ఉన్నా వీళ్లలో వీళ్లే చూసుకునేవారు. దీని వల్ల అజయ్ కి ఎలివేషన్ దొరకలేదు.
ఇక సోలోగా గేమ్ ఆడి ఉంటే అజయ్ మరికొన్ని రోజులు గేమ్ లో ఉండేవాడేమో. కొన్ని టాస్క్ లలో అంతగా అజయ్ పెర్ఫామ్ చేయలేదు. అంతేకాదు, కెప్టెన్ గా కూడా అవ్వలేదు. దీంతో అజయ్ ని టార్గెట్ చేసి హౌస్ మేట్స్ నామినేట్ చేశారు. అందుకే, ఈవారం అజయ్ నామినేషన్స్ లోకి వచ్చాడు. వైల్డ్ కార్డ్ గా వచ్చిన బాబాభాస్కర్ బిందుని సేఫ్ చేయడంతో అజయ్ కి సేఫ్ అయ్యే ఛాన్స్ పోయింది. దీంతో అజయ్ ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. మొత్తానికి అదీ మేటర్.