Ajith: స్టార్ హీరోకు మాతృ వియోగం
- May 31, 2026 / 03:04 PM ISTByFilmy Focus Desk
ప్రముఖ తమిళ కథానాయకుడు అజిత్ కుమార్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన మాతృమూర్తి మోహిని మణి (85) శనివారం కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న మోహిని మణి శనివారం ఉదయం స్వగృహంలో తుదిశ్వాస విడిచారని అజిత్ సన్నిహితులు తెలిపారు. ప్రస్తుతం దుబాయిలో ఉన్న అజిత్ చెన్నై బయల్దేరి వచ్చారు. మూడేళ్ల క్రితం అజిత్ తండ్రి సుబ్రహ్మాణ్యం మరణించిన విషయం తెలిసిందే. అప్పటి నుండి మోహిని మణి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే.
Ajith
ఇక అజిత్ మాతృమూర్తి మృతి పట్ల చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అజిత్ కుమార్ తండ్రి సుబ్రహ్మణ్యం కేరళకు చెందిన తమిళ పాలక్కాడ్ అయ్యర్ కుటుంబానికి చెందినవారు. మోహిని పశ్చిమ బెంగాల్‌కి చెందిన సింధి. వీరిది ప్రేమ వివాహం. వీరికి ముగ్గురు పిల్లలు. అందులో ఒకరు అజిత్ కాగా, మరో ఇద్దరు అనూప్ కుమార్, అనిల్ కుమార్.














