అజిత్ (Ajith) తమిళంలో తిరుగులేని స్టార్ హీరో. కొన్నాళ్లుగా అతనికి సరైన హిట్టు లేదు. ‘వలీమై’ ‘విదాముయార్చి’ (Vidaamuyarchi) (తెలుగులో ‘పట్టుదల’) వంటి సినిమాలు డిజాస్టర్లుగా మిగిలాయి. ‘తునీవు'(తెలుగులో ‘తెగింపు’) మంచి ఓపెనింగ్స్ ను రాబట్టినా.. అది కూడా కంటెంట్ తో మెప్పించలేదు. దీంతో అజిత్ ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళు విజయ్ (Vijay Thalapathy) ఫ్యాన్స్ కి అడ్డంగా దొరికిపోయినట్టు అవుతుంది. అజిత్ కనుక ఒక మాస్ సినిమా తీస్తే కచ్చితంగా అతను ఇండస్ట్రీ హిట్ కొట్టేస్తాడు అందులో డౌటే లేదు.
దర్శకుడు సిరుతై శివ (Siva) ఈ విషయాన్ని ‘వీరం'(తెలుగులో వీరుడొక్కడే) ‘వేదాలం’ (Vedalam) ‘విశ్వాసం’ (Viswasam) సినిమాలతో ప్రూవ్ చేశాడు. అవన్నీ తమిళంలో ఇండస్ట్రీ హిట్లుగా నిలిచాయి. అయితే ఈ మధ్య అజిత్ … ప్రయోగాత్మక సినిమాలు ఎంచుకుంటున్నాడు. అతని లేటెస్ట్ మూవీ ‘పట్టుదల’ అతని స్టార్ స్టేటస్ కి ఏమాత్రం మ్యాచ్ కానీ మూవీ. అందుకే ఇప్పుడు ఓ మాస్ మూవీ చేసి ఫ్యాన్స్ ఆకలి తీర్చాలని భావిస్తున్నాడు అజిత్. ప్రస్తుతం అతను ‘మైత్రి’ బ్యానర్లో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ (Good Bad Ugly) అనే సినిమా చేస్తున్నాడు.
దీని తర్వాత ఓ టాలీవుడ్ దర్శకుడితో అతను ఓ మాస్ సినిమా చేయబోతున్నట్లు టాక్. ఆ టాలీవుడ్ దర్శకుడు మరెవరో కాదు గోపీచంద్ మలినేని (Gopichand Malineni). ఇతను అజిత్ కి ఒక కథ చెప్పి ఒప్పించాడట. ఇది ఔట్ అండ్ ఔట్ మాస్ సినిమా అని తెలుస్తుంది. ప్రస్తుతం మలినేని బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్(Sunny Deol) తో ‘జాత్’ (Jaat) అనే సినిమా చేస్తున్నాడు. తర్వాత అజిత్ సినిమా ఫైనల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ‘మైత్రి’ సంస్థ ఈ సినిమాను నిర్మించే అవకాశాలు ఉన్నాయి.