గతవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘బ్రహ్మ ఆనందం’ (Brahma Anandam) సినిమా ప్రేక్షకుల నుండి పర్వాలేదు అనిపించే టాక్ తెచ్చుకుంది. రాజా గౌతమ్ (Raja Goutham) హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో బ్రహ్మానందం (Brahmanandam) అతి ముఖ్య పాత్ర పోషించారు. నిఖిల్ ఆర్.వి.ఎస్ దర్శకుడు. ‘స్వధర్మ ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై రాహుల్ యాదవ్(Rahul Yadav Nakka) ఈ చిత్రాన్ని నిర్మించారు. నిజ జీవితంలో తండ్రీకొడుకులు అయినటువంటి బ్రహ్మానందం, రాజా గౌతమ్..లు ఈ సినిమాలో తాత మనవడుగా నటించడం అని చెప్పాలి.
తిరిగి హీరోగా బిజీ అవ్వాలని చూస్తున్న రాజా గౌతమ్ కి ఇది చాలా ముఖ్యమైన సినిమా. అందుకే బ్రహ్మానందం ఇండస్ట్రీలో ఉన్న తన సర్కిల్ మొత్తాన్ని వాడి ఈ సినిమాని నిలబెట్టాలి అని డిసైడ్ అయ్యారు. అందుకోసం చాలా యూట్యూబ్ ఛానల్స్ కి ఆయన ఇంటర్వ్యూలు ఇచ్చారు. మరోపక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించారు. రిలీజ్ తర్వాత కూడా ప్రెస్మీట్లు వంటి వాటిలో యాక్టివ్ గా పాల్గొంటున్నారు.
అది మాత్రమే కాదు.. ఈ సినిమా గురించి స్టార్స్ తో పోస్టులు కూడా పెట్టించి పుష్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టు స్పష్టమవుతుంది. విషయం ఏంటంటే.. ‘బ్రహ్మ ఆనందం’ సినిమా గురించి ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) హీరోలు తమ ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెట్టి మరీ ఈ సినిమాకి పుష్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ముందుగా ఎన్టీఆర్..” ‘బ్రహ్మ ఆనందం’ సినిమా గురించి పాజిటివ్ రిపోర్ట్స్ వినిపిస్తున్నాయి. కంగ్రాట్యులేషన్స్ టు బ్రహ్మానందం గారు, రాజా గౌతమ్ అండ్ టోటల్ టీం” అంటూ తన ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టాడు.
దాన్ని బ్రహ్మానందం రీ- పోస్ట్ చేస్తూ..’ ఈ ఫీలింగ్ ఏంట్రా..! గుండె ఏదో వణుకుతున్నట్టు ఉందిరా’ అంటూ ‘అదుర్స్’ లో ఎన్టీఆర్ తో(Jr NTR) పలికిన డైలాగ్ ను గుర్తు చేస్తూ ‘థాంక్యూ నాన్న’ అంటూ రిప్లై పెట్టి స్టోరీలోకి యాడ్ చేశారు. ఇక రామ్ చరణ్ (Ram Charan) .. ‘కంగ్రాట్యులేషన్స్ టు బ్రహ్మానందం గారు, రాజా గౌతమ్ అండ్ ‘బ్రహ్మ ఆనందం’ టీం అందరికీ’ అంటూ పోస్ట్ పెట్టాడు. ఇలా ‘బ్రహ్మ ఆనందం’ కి ఆర్.ఆర్.ఆర్ హీరోలు అండగా నిలబడ్డారు అని స్పష్టమవుతుంది.