కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల వేడుకని ఘనంగా నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము .. అజిత్ కుమార్ కు పద్మ అవార్డుని అందజేశారు.మొన్న ఐపీఎల్ మ్యాచ్ లో కనిపించినట్టే క్లీన్ షేవ్లో అజిత్ కనిపించారు. బ్లాక్ కలర్ సూట్లో చాలా స్టైలిష్ గా ఈ అవార్డుల వేడుకలో ఆయన సందడి చేశారు. అజిత్ తో పాటు ఆయన ఫ్యామిలీ కూడా ఢిల్లీలో కనిపించి సందడి చేసినట్లు తెలుస్తుంది.
సినీ పరిశ్రమలో అజిత్ చేసిన సేవలను గుర్తించి ఆయనకు ఈ అవార్డుని అందజేసినట్టు స్పష్టమవుతుంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే స్వభావం కలిగిన వ్యక్తి అజిత్. ఆయన అన్ని రకాలుగా ఈ అవార్డుకి అర్హులు అని చెప్పాలి. ఇక ఈ అవార్డు రావడం పై అజిత్.. “భారత రాష్ట్రపతి నుండి గౌరవప్రదమైన పద్మభూషణ్ అవార్డును అందుకోవడం గర్వంగా అనిపిస్తుంది. ఇందుకు గాను ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ములకు ధన్యవాదాలు.
ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పుడు నా తండ్రి ఉండి ఉంటే బాగుండేది. నాపై అపారమైన ప్రేమను చూపించి, ఎన్నో త్యాగాలు చేసిన నా తల్లికి నేను కృతజ్ఞుడనై రుణపడి ఉంటాను. 25 ఏళ్లుగా నాకు తోడుగా ఉన్న నా భార్య షాలినికి కృతజ్ఞతలు, నా ఆనందానికి, విజయానికి కారణం షాలిని (Shalini)” అంటూ పద్మ అవార్డు ప్రకటించినప్పుడు తెలిపిన సంగతి తెలిసిందే.
పద్మభూషణ్ అవార్డు అందుకున్న అజిత్ కుమార్#PadmabhushanAjithKumar #AjithKumar #Ajith pic.twitter.com/d8vVVcqVRj
— Filmy Focus (@FilmyFocus) April 28, 2025