Ajith, Vijay: విజయ్ ఎప్పుడొస్తే.. అజిత్ కూడా అప్పుడే!

రాబోయే సంక్రాంతికి టాలీవుడ్ లో కాదు.. కోలీవుడ్ లో కూడా భారీ పోటీ నెలకొంది. విజయ్ హీరోగా దర్శకుడు వంశీ పైడిపల్లి ‘వారసుడు’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలొకొన్నాయి. నిర్మాత దిల్ రాజుకి ఈ సినిమా కోసం భారీ డీల్స్ వస్తున్నాయి. పైగా ఈ సినిమాను పక్కా తమిళ సినిమా అని వంశీ క్లారిటీ ఇవ్వడంతో ఫ్యాన్స్ కు మరింత ఉత్సాహం వచ్చింది. తమిళంలో ఈ సినిమా కోట్లు కొల్లగొట్టడం ఖాయం.

తెలుగులో వచ్చేదంతా బోనస్ అంటే చెప్పుకోవాలి. అందుకే ఇక్కడి ‘వాల్తేర్ వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ పోటీని సీరియస్ గా తీసుకోవడం లేదు. ‘ఆదిపురుష్’తో కొంత ఇబ్బంది ఉండొచ్చేమో కానీ తమిళనాట మాత్రం విజయ్ బొమ్మకే క్రేజ్ ఉంటుంది. ఇదిలా ఉండగా.. అజిత్ హీరోగా వినోత్ దర్శకత్వంలో రూపొందిన ‘తునివు’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని సంక్రాంతికే రిలీజ్ చేయాలని నిర్మాత బోనీకపూర్ గట్టి సంకల్పంతో ఉన్నట్లు సమాచారం.

అంటే ‘వారసుడు’తో పోటీ పడడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. తమిళనాడులో అజిత్, విజయ్ ఫ్యాన్ వార్ ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఫ్యాన్ వార్స్ జరగడం ఖాయం. అజిత్ ‘తునివు’ సినిమాను ఎలాగైనా ‘వారసుడు’ వచ్చే డేట్ కి వేయాలనే చూస్తున్నారు. థియేటర్ల అగ్రిమెంట్ విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే ఇంతకంటే మార్గం లేదని భావిస్తున్నారు.

ఒకవేళ ముందొచ్చినా.. ఆలస్యంగా వచ్చినా.. దాని వలన స్క్రీన్ కౌంట్ ప్రభావితం చెందే అవకాశం ఉంటుంది. కనుక సమానంగా పంపకాలు జరగాలంటే ఇంతకంటే మార్గం లేదని డిస్ట్రిబ్యూటర్లు సూచించడంతో దానికే రెడీ అయినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు ఎవరూ డేట్స్ అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus