తమిళ చిత్ర పరిశ్రమలో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న హీరోలలో అజిత్ కూడా టాప్ లిస్టులో ఉంటాడు అని చెప్పవచ్చు. ఏలాంటి కాంట్రవర్సీ లోకి వెళ్లకుండా కేవలం సినిమాలతో తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయే ఈ హీరో అంటే మాస్ ప్రేక్షకులకు చాలా ఇష్టం. ఇక అజిత్ సినిమా విడుదలవుతోంది అంటే తమిళ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన వాతావరణం నెలకొంటుంది. ఇక మొదటి సారి అజిత్ సినిమా తెలుగులో కూడా భారీ స్థాయిలో విడుదల అవుతోంది కెరీర్ మొదట్లో తన మొదటి సినిమా తెలుగులోనే చేశాడు.
ఇక మళ్లీ చాలా కాలం తర్వాత ఆయన తెలుగు మార్కెట్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక ఫిబ్రవరి 24 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల అవుతున్న ఈ సినిమా ఏ స్థాయిలో బిజినెస్ చేస్తోంది అనే విషయంలో అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. ఇక తెలుగులో వాలిమై బిజినెస్ ఎలా ఉంది అనే వివరాల్లోకి వెళితే.. తెలుగులో ఈ సినిమా మా రెండు కోట్ల యాభై లక్షల వరకు బిజినెస్ చేసినట్లు సమాచారం.
అంటే బాక్సాఫీస్ వద్ద హిట్ అవ్వాలి అంటే కనీసం రెండు కోట్ల యాభై లక్షల షేర్ ను అందుకోవాల్సి ఉంటుంది. అజిత్ కుమార్ నటించిన వాలిమై థియేట్రికల్ ప్రీ-రిలీజ్ బిజినెస్ ఈ విధంగా ఉంది:
తమిళనాడు
64.50 cr
ఏపి+తెలంగాణ (టోటల్)
2.50 cr
కర్ణాటక
4.00 cr
కేరళ
2.50 cr
నార్త్ ఇండియా
2.50 cr
ఇండియాలో టోటల్ గా
76.00 cr
ఓవర్సీస్
20.00 cr
వరల్డ్ వైడ్ టోటల్
96.00 cr
వాలిమై సినిమా బాక్సాఫీస్ వద్ద కావాలి అంటే వరల్డ్ వైడ్ గా కనీసం 97 కోట్ల షేర్ను రాబట్టాల్సి ఉంటుంది. ఇక తెలుగులో ఈ సినిమా సక్సెస్ అవ్వాలంటే కనీసం రెండు కోట్ల 70 లక్షల షేర్ అందుకోవాల్సి ఉంటుంది.