తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ కు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అజిత్ నటించిన మొదటి పాన్ ఇండియా మూవీ ‘వలీమై’… తమిళ్ తో పాటు హిందీ, తెలుగు, కన్నడ భాషల్లో ఫిబ్రవరి 24న ఏకకాలంలో విడుదల కానుంది.బోనీకపూర్ నిర్మిస్తున్నఈ చిత్రాన్ని హెచ్. వినోద్ దర్శకత్వంవహించాడు. ఈ చిత్రంలో టాలీవుడ్ హీరో కార్తికేయ గుమ్మకొండ విలన్ గా నటించడం మరో విశేషం.బైక్ ఛేజింగ్, యాక్షన్ ఎపిసోడ్స్ తో ట్రైలర్ అందరినీ ఆకర్షించింది.
అజిత్, కార్తికేయ.. మధ్యలో వచ్చే సన్నివేశాలు కూడా ఆకట్టుకుంటాయని ట్రైలర్ స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. ఈ చిత్రం ఫస్ట్ రివ్యూ ఆల్రెడీ బయటకి వచ్చేసింది. ప్రముఖ సినీ విశ్లేషకుడు ఉమర్ సంధు ఈ చిత్రాన్ని వీక్షించి తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపాడు. కోలీవుడ్లో రూపొందిన బెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీస్లో ఇది అగ్ర స్థానం దక్కించుకుంటుందని, అజిత్ కుమార్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడని, వాట్ ఎ రేసీ థ్రిల్లర్ అంటూ ప్రశంసించాడు.
కార్తికేయ, హుమా ఖురేషి, బానిజ్ ల నటన నటన టెరిఫిక్ అని, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, రేసీ స్క్రీన్ ప్లే అన్ని పర్ఫెక్ట్ గా కుదిరాయని కూడా చెప్పుకొచ్చాడు. నిర్మాణ విలువలు, కాస్ట్యూమ్ డిజైనర్లు, ఫైట్ మాస్టర్స్ ఇవన్నీ కూడా అత్యద్భుతంగా కుదిరాయని ఇలాంటి పెద్ద ప్రాజెక్టుని హ్యాండిల్ చేయడంలో దర్శకుడు హెచ్.వినోద్ నూటికి నూరుపాళ్లు సక్సెస్ సాధించాడని అతను తెలిపాడు. కచ్చితంగా ఇది యాక్షన్ మూవీ ప్రియులనే కాకుండా మాస్ ఆడియెన్స్ కూడా నచ్చే విధంగా ఉందని చెబుతూ ఏకంగా 5 కి 4 రేటింగ్ ను ఇచ్చేసాడు ఉమర్.
అయితే ఇతను చెప్పిన రివ్యూలు యాజ్ ఇట్ ఈజ్ గా ఉంటాయని చెప్పలేము. ‘సర్దార్ గబ్బర్ సింగ్’, ‘బ్రహ్మోత్సవం’, ‘సాహో’ వంటి చిత్రాలకు కూడా ఇతను పాజిటివ్ రివ్యూలు చెప్పాడు. అవి నిరాశపరిచిన సంగతి తెలిసిందే.
First Review of #Valimai from Overseas Censor Board :#AjithKumar Nailed it. Terrific Performances by Supporting cast as well #Kartikeya, @humasqureshi & #BaniJ. High Octane Action Stunts, Thrilling Background Score & Racy Screenplay. A Perfect Mass Blockbuster.
First Review of #Valimai from Overseas Censor Board :
One of the Best Action Thriller ever made in Kollywood. #AjithKumar gave Career One of the Best Performance. He Stole the Show all the way. What a Racy Thriller from start to end. DEADLY BLOCKBUSTER. #ValimaiReview