Good Bad Ugly: పాన్ ఇండియా రేంజ్ సినిమా.. కానీ ప్రమోషన్స్ లో నిశ్శబ్దమే!

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) లేటెస్ట్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ (Good Bad Ugly) ఎట్టకేలకు ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అధిక్ రవిచంద్రన్ (Adhik Ravichandran) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్‌తో రూపొందింది. ఇందులో అజిత్ మూడు విభిన్న షేడ్స్‌తో కనిపించనున్నాడు. పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. అయినప్పటికీ, సినిమా ప్రమోషన్ పరంగా మాత్రం బజ్ కనిపించడం లేదు.

Good Bad Ugly

ఈ సినిమాపై ఎక్కడా హడావుడి లేకపోవడంపై సినీ వర్గాల్లో చర్చ మొదలైంది. మైత్రీ మూవీ మేకర్స్ సాధారణంగా తమ సినిమాల కోసం భారీ ప్రమోషన్ స్ట్రాటజీలు అమలు చేస్తూ టాప్ లెవెల్ హైప్ తీసుకొస్తుంది. అయితే ఈసారి మాత్రం మినిమమ్ ప్రమోషన్ కూడా లేకుండా విడుదల తేదీ దగ్గర పడుతోంది. దీని వెనుక అజిత్ వ్యక్తిగత విధానం కారణమని అంటున్నారు. అజిత్ సినిమా ప్రమోషన్లకు పెద్దగా ముందుకు రారని అందరికీ తెలిసిందే. ఆయన్ను ఈవెంట్ కు రప్పించడం, ఇంటర్వ్యూలు ఇవ్వించడం అరుదైన విషయాలే.

ఆ విధానాన్ని మైత్రీ మార్చాలనుకుంటున్నా, ఇప్పటి వరకు ఏదైనా ప్రచార కార్యక్రమానికి అజిత్ రెస్పాన్స్ ఇచ్చారనే వార్తలు లేవు. దీంతో సినిమా టీమ్ కూడా అసహాయంగా మారిందన్న టాక్ వినిపిస్తోంది. ఈ మధ్య ‘పట్టుదల’ (Pattudala) మూవీతో ఫెయిల్యూర్ ఎదుర్కొన్న అజిత్, ఈ సినిమా మీద ఆశలు పెట్టుకున్నారు. మూడు డిఫరెంట్ షేడ్స్‌లో కనిపించనున్న ఆయన క్యారెక్టర్‌కు ఆకర్షణ ఉందన్న ఫీడ్‌బ్యాక్ వినిపిస్తోంది. కానీ ప్రమోషన్ లేకుండా సినిమా రీచ్ అవుతుందా? అన్న సందేహం బలంగా ఉంది.

పైగా, ఈసారి టాలీవుడ్‌లోనూ స్పెషల్ రిలీజ్ ప్లాన్ చేసినప్పటికీ అక్కడ కూడా బజ్ తక్కువగానే కనిపిస్తోంది. మొత్తానికి, అజిత్ స్టైల్‌కి తగ్గట్టే మినిమమ్ ప్రమోషన్‌తో మేజర్ రిలీజ్‌కు మేకర్స్ రెడీ అవుతున్నారు. కానీ ఈ నిశ్శబ్ద వ్యూహం సినిమాకు ఉపయోగపడుతుందా? లేదా బజ్ లేకపోవడమే నెగెటివ్‌గా మారుతుందా అన్నది చూడాలి. ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించేలా చివరి నిమిషంలో ఏదైనా స్పెషల్ కంటెంట్ రాబోతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus