Akash Puri: నాన్న కాకుండా ఆ డైరెక్టర్స్ అంటే ఇష్టం.. ఆకాష్!

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోకి స్టార్ సెలబ్రిటీల పిల్లలు వారసులుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వారి కంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఇండస్ట్రీలో ఎంతోమంది సెలబ్రిటీల పిల్లలు అగ్రనటులు కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వారసుడిగా ఆకాష్ పూరి ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈయన బాలనటుడిగా ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందారు. ఈ క్రమంలోనే ఆకాష్ ప్రస్తుతం ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు.

ఇకపోతే రొమాంటిక్, ధోని, ఆంధ్ర పోరి వంటి సినిమాల ద్వారా హీరోగా పరిచయం అయిన ఆకాష్ తాజగా చోర్ బజార్ చిత్రంలో నటించారు. ఈ సినిమా ఈ నెల 24వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఆకాష్ ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన ఎన్నో ఆసక్తికరమైన విషయాల గురించి వెల్లడించారు. ఎప్పుడైనా ప్రేమలో పడ్డారా అని అలీ ప్రశ్నించగా తాను ఆరో తరగతిలోనే ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డానని, తెలిసీ తెలియని వయసులో అమ్మాయి చూడటానికి ఆనందంగా కనిపించింది.

ఈ విషయం వెళ్లి అమ్మకు చెబితే అమ్మ ఏకంగా ఒక గంట పాటు క్లాస్ పీకిందని ఆకాశ్ ఈ సందర్భంగా ఆరో తరగతిలో ప్రేమ గురించి బయట పెట్టారు. ఇకపోతే తనకు రాహుల్‌, విజయ్‌ బాగా సన్నిహితం, రోషన్‌ను తరచూ కలుస్తుంటా. ప్రభాస్‌తో ఇప్పుడు సరదాగా గడుపుతూ ఉంటానని ఈ సందర్భంగా ఆకాష్ వెల్లడించారు. ఇకపోతే తన తండ్రి ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న డైరెక్టర్ అయినప్పటికీ తనకు తన తండ్రి కాకుండా ఇండస్ట్రీలో రాజమౌళి,

త్రివిక్రమ్ శ్రీనివాస్, వి. వి వినాయక్ అంటే ఎంతో ఇష్టమని ఈ దర్శకుల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలు నాపై చాలా ప్రభావాన్ని చూపాయని ఈ సందర్భంగా ఆకాశ్ వెల్లడించారు.ఇక తన తండ్రితో సినిమా ఎప్పుడు చేస్తారని ప్రశ్నించగా బయట అందరూ పూరి జగన్నాథ్ కొడుకుగా కాకుండా నాకంటూ మంచి గుర్తింపు వచ్చిన తర్వాతనే తన తండ్రితో సినిమా చేస్తానని ఆకాష్ తెలిపారు.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus