Chor Bazaar: ఈ నెలలోనే రానున్న ఆకాష్ పూరి చోర్ బజార్?

ఇప్పటికి ఇండస్ట్రీలోకి ఎంతోమంది వారసులు అడుగుపెట్టి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకొని ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న పూరి జగన్నాథ్ వారసుడిగా ఇండస్ట్రీలోకి బాలనటుడిగా అడుగుపెట్టారు ఆయన కుమారుడు ఆకాష్ పూరి.పలు సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఆకాశ్ తన నటనతో ప్రేక్షకులను సందడి చేశారు. అనంతరం ధోనీ,మోహబుబా, రొమాంటిక్ వంటి సినిమాలతో హీరోగా సందడి చేసిన ఆకాశ్ చోర్ బజార్ అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

జీవన్ రెడ్డి దర్శకత్వంలో ఐ.వి ప్రొడక్షన్స్ పతాకంపై వీ.ఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్ మంచి ఆదరణ సంపాదించుకొని సినిమా పై అంచనాలు పెంచాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా విడుదల తేదీ గురించి చిత్రబృందం సరికొత్త అప్డేట్ విడుదల చేశారు. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 24వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైందని చిత్రబృందం వెల్లడించారు.

మంగళవారం హైదరాబాద్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో భాగంగా డైరెక్టర్ జీవన్ రెడ్డితో పాటు, ఆకాష్ ఇతర చిత్ర బృందం పాల్గొన్నారు. ఈ క్రమంలోనే సినిమా విడుదల విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆకాష్ మాట్లాడుతూ ఈ సినిమాకు ట్రైలర్ సాంగ్స్ ను ఎంతగానో ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇకపోతే డైరెక్టర్ జీవన్ రెడ్డి మాట్లాడుతూ..

ఈ సినిమా కథ వినగానే ఈ కథకు యంగ్ హీరో అయితే బాగుంటుందని అనిపించింది ఆ క్షణమే నా మదిలో ఆకాష్ కదిలాడు. అనుకున్న విధంగానే ఈ సినిమాలో బచ్చన్ సాబ్ పాత్రలో ఆకాష్ పూరి ఎంతో అద్భుతంగా నటించారని ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని ఈ సందర్భంగా జీవన్ రెడ్డి తెలిపారు. బాల నటుడిగా హీరోగా పలు సినిమాలలో నటించి నటుడిగా గుర్తింపు పొందిన ఆకాష్ చోర్ బజార్ చిత్రం ద్వారా ఎలాంటి విజయాన్ని అందుకుంటారో తెలియాల్సి ఉంది.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus