Akash Puri: జిమ్ క్లీనర్ గా చేశాను… పూరి తనయుడు షాకింగ్ కామెంట్స్..!

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ కొడుకు ఆకాష్‌ పూరి హీరోగా వరుస సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘మెహబూబా’ ‘రొమాంటిక్’ వంటి చిత్రాల తర్వాత అతను హీరోగా రూపొందిన చిత్రం ‘చోర్‌ బజార్‌’. ఈ చిత్రం త్వరలో విడుదల కాబోతుంది.’దళం’ ‘జార్జ్ రెడ్డి’ వంటి విభిన్న కథాంశంతో కూడుకున్న చిత్రాలను అందించిన జీవన్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. ఇక ఈ చిత్రం ప్రమోషన్లలో భాగంగా ఆకాష్ మాట్లాడుతూ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చాడు.

అతని చిన్నతనం నుండి హీరో అయ్యే వరకు జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్స్ ను చెప్పుకొచ్చాడు. ఆకాష్ మాట్లాడుతూ.. “ఒకసారి సినిమా షూటింగ్‌ జరుగుతుంటే గోడ మీద నుంచి ఎగిరెగిరి చూడ్డానికి ట్రై చేశాను. అప్పుడు సెక్యూరిటీ లాగి పెట్టి కొట్టి వెళ్లిపోమన్నాడు.తర్వాత ఇంట్లో ఖాళీగా ఉన్నావు, పార్ట్‌ టైం జాబ్‌ చూశాను, చేయమన్నారు నాన్న. అప్పుడు జిమ్‌కు వెళ్లి క్లీనింగ్‌ చేశాను. ఆర్థిక సమస్యలతో ఇక్కడ జాబ్‌ చేస్తున్నానన్నాను.

కానీ వాళ్ళకి నేను పూరి గారి అబ్బాయిని అని తెలిసిపోయింది. ఇక ‘ఆంధ్రావాలా’ మూవీలో నా పాత్ర ఫిక్సయిపోయింది అనుకున్న టైములో సడన్‌గా ఫోన్‌ చేసి నువ్వు చేయట్లేదు అన్నారు.మా నాన్న నన్నెందుకు తొక్కేస్తున్నారు అని ఆ టైములో బాధపడ్డాను.తర్వాత చిరుత ఆఫర్ ఇచ్చారు. రాంచరణ్ అన్నయ్య .. నాకు జెల్‌ అంటే ఇష్టమని నాకు రకరకాల హెయిర్‌ స్టైయిల్స్‌ వేశారు. ఇలాంటి చిలిపి పనులు చాలా చేశాను.

ఇక సినిమాల విషయానికి వస్తే పూరి కొడుకు.. పూరి కొడుకు, స్టార్‌డమ్‌ ఉన్న వాళ్ల నాన్న ఉన్నాడు, వాడికేంటి? అనే వాళ్ళు చాలామంది ఉన్నారు.అందుకే మా నాన్న నాతో సినిమా చేద్దాం అన్నా కూడా నేను మొదట నో చెప్పాను. పూరి కొడుకు అనే ట్యాగ్ పోగొట్టుకున్నాకే నీ డైరెక్షన్ లో సినిమా చేస్తానని చెప్పాను” అంటూ చెప్పుకొచ్చాడు.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus