Akash Puri: చోర్ బజార్ హీరోయిన్ కు ఆకాష్ తో నటించడం ఇష్టం లేదా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న పూరి జగన్నాథ్ వారసుడిగా ఇండస్ట్రీలోకి ఆకాష్ బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఇలా బాల నటుడిగా పలు సినిమాలను నటించిన ఆకాష్ అనంతరం హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఇకపోతే హీరోగా ఆకాష్ నటించిన సినిమాలలో ఇప్పటివరకు ఏది సరైన హిట్ అవ్వలేదని చెప్పాలి. ఇకపోతే తాజాగా ఆకాష్ చోర్ బజార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. జీవన్ రెడ్డి దర్శకత్వంలో ఆకాష్ పూరి గెహ్నా సిప్పి హీరో హీరోయిన్లుగా నటించారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించిన ఫ్రీ రిలీజ్ వేడుకలో బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యల వల్ల అందరి ఫోకస్ ఈ సినిమాపై పడింది. ఈ క్రమంలోనే ఈ సినిమా ఆకాష్ కెరీర్ కి ప్లస్ అవుతుందని అందరూ భావించారు. అయితే ఎప్పటిలాగే ఈ సినిమా కూడా ఆకాష్ పూరిని డిసప్పాయింట్ చేసిందని చెప్పాలి.ఇకపోతే తాజాగా బుల్లితెర పై ప్రసారం అవుతున్న కార్యక్రమాలలో పెద్ద ఎత్తున సినీ సెలబ్రిటీల సందడి చేస్తున్న విషయం మనకు తెలిసిందే ఈ క్రమంలోని సుమా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న క్యాష్ కార్యక్రమంలో చోర్ బజార్ చిత్ర బృందం సందడి చేశారు.

తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా సుమ ఎప్పటిలాగే వీరితో తనదైన శైలిలో పంచ్ డైలాగులు వేస్తూ అందరిని సందడి చేసారు. ఇక సుమ ఆకాష్ ను ప్రశ్నిస్తూ మీకు పూరి జగన్నాథ్, రామ్ గోపాల్ వర్మ ఇద్దరిలో ఎవరు చెప్పే డైలాగులు బాగా నచ్చుతాయని ప్రశ్నించారు. అదేవిధంగా హీరోయిన్ గెహ్నా సిప్పిని ఓ ప్రశ్న వేసి సుమ అందరిని ఇరకాటంలో పెట్టింది.

ఈ కార్యక్రమంలో భాగంగా సుమా హీరోయిన్ ని ప్రశ్నిస్తూ మీకు ఆకాష్ తో కలిసిన నటించడం ఇష్టమా లేకపోతే జీవన్ రెడ్డితో సినిమా చేయడం ఇష్టమా అని ప్రశ్నించగా గెహ్నా సిప్పి ఏ మాత్రం ఆలోచించకుండా జీవన్ రెడ్డి పేరు చెప్పింది. దీంతో ఆకాష్ ఎంతో హర్ట్ అయ్యి అక్కడ నుంచి వెళ్లిపోయారు. అప్పటికి హీరోయిన్ సారీ చెబుతున్న ఈయన పట్టించుకోకుండా కార్యక్రమం మధ్యలో నుంచి బయటకు వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ కావడంతో కేవలం ఎపిసోడ్ పై హైప్ తీసుకురావడానికి ఇలా చేశారు అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus