నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో రూపొందిన ‘అఖండ’ పెద్ద బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దానికి సీక్వెల్ గా ‘అఖండ 2′(అఖండ 2 : తాండవం) రాబోతోంది. ఈ సినిమాని మాత్రం పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఆది పినిశెట్టి ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ వంటివి ఆడియన్స్ కి మంచి కిక్ ఇచ్చాయి.
అవి డిసెంబర్ 5న రిలీజ్ కాబోయే ఈ సినిమాపై హైప్ పెంచాయి. తమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు.

ఇక ‘అఖండ 2 తాండవం’ లిరికల్ సాంగ్ విషయానికి వస్తే ఇది 4 నిమిషాల 23 సెకన్ల నిడివి కలిగి ఉంది. అయితే ఇందులో లిరిక్స్ తొందరగా అర్థమయ్యేలా లేవు. పూర్తిగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి సెట్ అయ్యే విధంగా ఉంది. మొదటి భాగంలో.. అంటే ‘అఖండ’ లో ‘భమ్ అఖండ’ అంటూ అఘోర పాత్ర వచ్చినప్పుడు ఓ పాట వస్తుంది. సరిగ్గా అలానే ఈ తాండవం లిరికల్ సాంగ్ కూడా ఉంది అని చెప్పాలి.
శంకర్ మహదేవన్. కైలాష్ ఖేర్, దీపక్ బ్లూ.. కలిసి ఆలపించిన ఈ పాటకి కళ్యాణ్ చక్రవర్తి లిరిక్స్ అందించారు. ఈ పాటలో కూడా త్రిశూలంతో బాలకృష్ణ శత్రుసంహారం చేస్తున్నట్టు చూపించారు. సినిమా చూస్తున్నప్పుడు ఈ పాట మరింతగా ఆడియన్స్ కి రీచ్ అయ్యే అవకాశం ఉంది. మీరు కూడా ఒకసారి వింటూ చూడండి :
