Akhanda Collections: ‘అఖండ’ తో కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ను సాధించిన బాలయ్య..!

నందమూరి బాలకృష్ణ హీరోగా స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ మూవీ `అఖండ`. ‘ద్వారకా క్రియేషన్స్‌’ బ్యానర్ పై మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 2న(నిన్న) ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలయ్యింది. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పాలి. ‘సింహా’ ‘లెజెండ్’ కాంబో కావడంతో ఈ సినిమా పై మొదటి నుండీ భారీ అంచనాలు నమోదయ్యాయి.దాంతో మొదటి రోజు ఈ చిత్రానికి టాక్ తో సంబంధం లేకుండా భారీ ఓపెనింగ్స్ నమోదయ్యాయి.

ఫస్ట్ డే కలెక్షన్లను ఓసారి గమనిస్తే :

నైజాం 4.38 cr
సీడెడ్ 3.30 cr
ఉత్తరాంధ్ర 1.35 cr
ఈస్ట్ 1.05 cr
వెస్ట్ 0.90 cr
గుంటూరు 1.87 cr
కృష్ణా 0.81 cr
నెల్లూరు 0.93 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 14.59 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 3.45 Cr
వరల్డ్ వైడ్ (టోటల్) 18.04 cr

‘అఖండ’ చిత్రానికి రూ.53.25 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.54 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. మొదటి రోజు ఈ చిత్రం రూ.18.04 కోట్ల షేర్ ను రాబట్టింది. బాలయ్య కెరీర్లో ఇవి బిగ్గెస్ట్ ఓపెనింగ్స్.అలాగే ఈ ఏడాది ‘వకీల్ సాబ్’ తర్వాత తెలుగులో మొదటిరోజు అత్యథిక కలెక్షన్లు నమోదు చేసిన చిత్రంగా ‘అఖండ’ రికార్డ్ సృష్టించింది.అయితే బ్రేక్ ఈవెన్ కు మరో రూ.35.96 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. లాంగ్ వీకెండ్ ను ఈ చిత్రం ఎంత వరకు క్యాష్ చేసుకుంటుందో చూడాలి..!

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
ప్రిన్స్ టు రవి.. ‘బిగ్ బాస్’ లో జరిగిన 10 షాకింగ్ ఎలిమినేషన్స్..!
చిరు, కమల్ మాత్రమే కాదు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ప్లాపైన స్టార్స్ లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus