స్టార్ హీరో బాలకృష్ణ చాలా సంవత్సరాల తర్వాత అఖండ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్నారు. క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా తర్వాత బాలయ్య నటించిన సినిమాలేవీ 30 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సాధించలేదు. సినిమాల విషయంలో బాలయ్య మారాలని మల్టీస్టారర్ సినిమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కామెంట్లు వినిపించాయి. అయితే అఖండ సినిమా మాత్రం అంచనాలను మించి విజయం సాధించింది.
ఈ సినిమా పది రోజుల్లో ఏకంగా 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించడం గమనార్హం. ఈ సినిమా షేర్ కలెక్షన్లు దాదాపుగా 60 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. బాలయ్య కెరీర్ లో ఈ రికార్డును అందుకున్న తొలి సినిమాగా అఖండ నిలిచింది. నైజాంలో ఈ సినిమాకు ఏకంగా 26 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. నైజాం బాలయ్య వీక్ జోన్ అయినా అక్కడ బాలయ్య సత్తా చాటడాన్ని చూసి సినీ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోతున్నారు.
ఏపీ, సీడెడ్ లో ఈ సినిమా 50 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించింది. మన దేశంలోని ఇతర ప్రాంతాలు, విదేశాలలో అఖండ 25 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. ఏపీలో టికెట్ రేట్లు ఎక్కువగా ఉండి ఉంటే మాత్రం అఖండ షేర్ కలెక్షన్లు మరింత ఎక్కువగా ఉండేవనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దేశంలో అడపాదడపా ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నా ఆ ప్రభావం అఖండ సినిమాపై పడలేదు.
అఖండ సినిమా సక్సెస్ వల్ల వచ్చిన కాన్ఫిడెన్స్ తో నిర్మాతలు ధైర్యంగా థియేటర్లలో సినిమాలను విడుదల చేస్తున్నారు. యావరేజ్ టాక్ వచ్చినా థియేటర్లలో మరే సినిమా నుంచి పోటీ లేకపోవడం అఖండకు కలిసొచ్చింది. మాస్ ప్రేక్షకులకు విందు భోజనంలా అఖండ సినిమా ఉండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులు ఆసక్తి చూపారు. బాలయ్య అఖండతో 100 కోట్ల క్లబ్ లో చేరడంతో అభిమానులు సంతోషిస్తున్నారు.
Most Recommended Video
‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!