చాలా సంవత్సరాల తర్వాత అఖండ సినిమాతో బాలయ్య ఖాతాలో భారీ బ్లాక్ బస్టర్ హిట్ చేరడంతో బాలయ్య అభిమానుల ఆనందానికి అవధులు లేవు. తెలుగు రాష్ట్రాల్లో అఖండ మూవీ తక్కువ సంఖ్యలో థియేటర్లలో ప్రదర్శితమవుతున్నా చెప్పుకోదగ్గ స్థాయిలో ఈ సినిమాకు కలెక్షన్లు వస్తుండటం గమనార్హం. అఖండ ఓటీటీ గురించి గతంలో చాలా వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే బాలయ్య ఫ్యాన్స్ మాత్రం అఖండ ఆలస్యంగా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
అఖండ ఓటీటీ హక్కులను కొనుగోలు చేసిన హాట్ స్టార్ సైతం ఫ్యాన్స్ కు తీపికబురు అందించింది. ఈ నెల 21వ తేదీనుంచి ఓటీటీలో అఖండ స్ట్రీమింగ్ కానుందని ఈ సంస్థ అధికారికంగా వెల్లడించింది. పుష్ప సినిమా కంటే ఆలస్యంగా అఖండ స్ట్రీమింగ్ కానుండటం గమనార్హం. రిలీజైన మూడు వారాలకే పుష్ప మూవీ ఓటీటీలో అందుబాటులోకి వస్తుండటంతో బన్నీ ఫ్యాన్స్ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఫైర్ అవుతున్నారు. అఖండ మేకర్స్ మాత్రం రిలీజైన ఏడు వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేలా హాట్ స్టార్ తో ఒప్పందం కుదుర్చుకోవడం గమనార్హం.
అఖండను థియేటర్లలో చూసిన ప్రేక్షకులు సైతం ఈ సినిమాను ఓటీటీలో చూడటానికి ఆసక్తి చూపుతున్నారు. అఖండ సినిమా ఫుల్ రన్ లో 71 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించింది. ఈ సినిమాతో దర్శకుడు బోయపాటి శ్రీను ఖాతాలో భారీ బ్లాక్ బస్టర్ హిట్ చేరింది. బోయపాటి శ్రీను తరువాత సినిమాలో బన్నీ హీరోగా నటించే అవకాశాలు ఉన్నాయని బోగట్టా. బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి బన్నీకి ఆఫర్లు వస్తుండగా బాలీవుడ్ ప్రాజెక్ట్స్ లో సెకండ్ హీరో రోల్స్ లో తాను నటించనని బన్నీ ఇప్పటికే వెల్లడించడం గమనార్హం.
బాలీవుడ్ లో పుష్ప సినిమా ఇప్పటికే 75 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించింది. అమెజాన్ ప్రైమ్ ఏకంగా 22 కోట్ల రూపాయలు చెల్లించి పుష్ప డిజిటల్ హక్కులను కొనుగోలు చేసినట్లు సమాచారం.
Most Recommended Video
ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!