బాలయ్య హీరోగా బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కిన అఖండ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించడంతో పాటు నటుడిగా బాలయ్య పేరు మారుమ్రోగడానికి కారణమైంది. ఈ సినిమాలో అఘోరా పాత్రలో బాలకృష్ణ నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. 50 రోజుల తర్వాత ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కాగా బుల్లితెరపై కూడా ఈ సినిమాకు మంచి రేటింగ్స్ వచ్చాయి.
4 కేంద్రాలలో 100 రోజుల పాటు ప్రదర్శించబడి అరుదైన రికార్డును అఖండ సొంతం చేసుకోవడం గమనార్హం. అఖండ సక్సెస్ తో బాలయ్య రెమ్యునరేషన్ తో పాటు బాలయ్య తర్వాత సినిమాల బడ్జెట్లు పెరిగాయి. అయితే ఒక థియేటర్ లో మాత్రం అఖండ 175 రోజుల పాటు ప్రదర్శించబడటం గమనార్హం. గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేటలో ఉన్న రామకృష్ణ థియేటర్ లో ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. సినిమా విడుదలై ఇన్ని రోజులైనా ప్రేక్షకాదరణ ఏ మాత్రం తగ్గలేదని కలెక్షన్లు బాగానే వస్తుండటంతో సినిమాను థియేటర్లలో ప్రదర్శిస్తున్నామని ఈ థియేటర్ నిర్వాహకులు చెబుతున్నారు.
ప్రస్తుత పరిస్థితులలో రెండు వారాల పాటు పెద్ద సినిమాలను ప్రదర్శించటం కష్టంగా ఉందని చాలామంది థియేటర్ల ఓనర్లు చెబుతున్నారు. అయితే బాలయ్య మాత్రం అరుదైన రికార్డులను ఖాతాలో వేసుకుంటున్నారు. అఖండ మూవీకి రికార్డ్ స్థాయిలో గ్రాస్ కలెక్షన్లు వచ్చాయని సమాచారం అందుతోంది. గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాతో, అనిల్ రావిపూడి సినిమాతో కూడా బాలయ్య ఘనవిజయాలను ఖాతాలో వేసుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
బాలయ్య భవిష్యత్తు సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయనే సంగతి తెలిసిందే. బాలయ్య ప్రస్తుతం ఒక్కో సినిమాకు 12 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. తర్వాత సినిమాల ఫలితాలను బట్టి బాలయ్య రెమ్యునరేషన్ విషయంలో మార్పులు ఉండనున్నాయని సమాచారం అందుతోంది.
Most Recommended Video
‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!