నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి తెరకెక్కించిన సినిమా ‘అఖండ’. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. బోయపాటి మేకింగ్, తమన్ మ్యూజిక్, రామ్ లక్ష్మణ్ యాక్షన్ సీన్స్ సినిమా స్థాయిని పెంచేశాయి. ఈ సినిమాలో విలన్స్ గా ఇద్దరు నటులు కనిపించారు. అందులో ఒకరు శ్రీకాంత్ కాగా.. మరొకరు నితిన్ మెహతా. స్వామిజీ పాత్రలో కనిపించిన నితిన్ మెహతా తన పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నారు. అయితే ఇతడొక ఆర్మీ ఆఫీసర్ అనే సంగతి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.
ఇంతకముందుకు ఇండియన్ ఆర్మీలో 21 సంవత్సరాల పాటు సేవలు అందించారు నితిన్ మెహతా. అయితే ఒక ప్రొఫెషనల్ మోడల్ గా, నటుడిగా మారాలని ఆయన కలలు కన్నారు. ఆ కల నెరవేర్చుకోవడానికి తనకు ఎంతో ఇష్టమైన ఆర్మీ ఉద్యోగాన్ని కూడా వదులుకున్నారట. గతంలో ఆయన కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ.. ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోలేకపోయారు ఇప్పుడు ‘అఖండ’ సినిమాతో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయారు. ఆయన నటనకు మంచి మార్కులు పడ్డాయి. దీంతో ఇప్పుడు అతడికి అవకాశాలు బాగానే వస్తున్నట్లు సమాచారం.
Most Recommended Video
‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!