Akhil, Ram Charan: రామ్ చరణ్ తో మల్టీస్టారర్… మనసులో కోరిక బయటపెట్టిన అఖిల్

అఖిల్ అక్కినేని ఏజెంట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా ఏప్రిల్ 28వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు. ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా అఖిల్ పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఎన్నో విషయాలను తెలియజేస్తున్నారు.

తాజాగా ప్రెస్ మీట్ లో పాల్గొన్నటువంటి ఈయన ఏజెంట్ సినిమా గురించి మాట్లాడుతూ.. ఏజెంట్ యాక్షన్ మూవీ అయినప్పటికీ, దాని వెనుక బలమైన ఎమోషన్స్ ఉంటాయనీ ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్టీ స్టార్ సినిమాల గురించి కూడా అఖిల్ మాట్లాడారు.. మనం లాంటి స్క్రిప్ట్ తరచూ చేయడం సాధ్యం కాదని తెలిపారు.కావాలని చెప్పేసి తరచూ అలాంటి ప్రయత్నాలు కనుక చేస్తే కాంబినేషన్స్ కి ఉన్న విలువ తగ్గిపోతుందని అఖిల్ వెల్లడించారు.

ఇక తన అన్నయ్య నాగచైతన్యతో కలిసి ఎప్పుడు సినిమా చేయబోతున్నారు అనే ప్రశ్న కూడా ఈయనకు ఎదురయింది. ఈ ప్రశ్నకు అఖిల్ సమాధానం చెబుతూ తన అన్నయ్యతో కలిసి మల్టీ స్టార్ సినిమా చేయాలనిపించే కథ ఇప్పటివరకు తనకు దొరకలేదని దొరికితే తప్పకుండా చేస్తానని తెలిపారు..

ఇక మల్టీ స్టార్ సినిమాల గురించి తాను (Akhil) పెద్దగా ఆలోచించలేదని ఒకవేళ మల్టీ స్టార్ సినిమాలలో నటించాల్సి వస్తే తాను రాంచరణ్ తో కలిసి సినిమా చేయడం కోసం ఇష్టపడతానని ఆ అవకాశం వస్తే తప్పకుండా నటిస్తాను అంటూ ఈ సందర్భంగా అఖిల్ తన మనసులో ఉన్న కోరికను బయటపెట్టారు.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus