సమంత పోస్టుకు రిప్లై ఇచ్చిన అఖిల్.. ఏమన్నారంటే!

టాలీవుడ్ నటి సమంత ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతూ అగ్రతారగా గుర్తింపు పొందిన నటి సమంత నటుడు నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ విధంగా నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని కారణాల వల్ల అతనితో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఇలా సమంత విడాకులు తీసుకున్న తరువాత నాగచైతన్యకు దూరంగా ఉన్నప్పటికీ ఆయన కుటుంబ సభ్యులతో మాత్రం ఈమె ఇప్పటికీ చాలా చనువుగా ఉన్నారని తెలుస్తుంది.

ఈ క్రమంలోనే అక్కినేని హీరోలు అయినటువంటి అఖిల్ సుమంత్ వంటి హీరోలు నటించిన సినిమాలు విడుదలయితే ఆ సినిమాలపై తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉంటారు. అలాగే అఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఈమె తనకు శుభాకాంక్షలు చేయడం చూస్తుంటే సమంతకు అక్కినేని కుటుంబ సభ్యులలో నాగచైతన్య కాకుండా ఇతరులతో మంచి అనుబంధం ఉందని తెలుస్తుంది..

ఈ క్రమంలోనే ఏప్రిల్ 8వ తేదీ అఖిల్ పుట్టినరోజు కావడంతో సమంత సోషల్ మీడియా వేదికగా అఖిల్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు ఏజెంట్ సినిమా ఫైర్ లా ఉండబోతోంది అంటూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా లవ్ ఏమోజీలను షేర్ చేస్తూ అఖిల్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక సమంత చెప్పిన శుభాకాంక్షలకు అఖిల్ రిప్లై ఇచ్చారు.

ఈ సందర్భంగా సమంత శుభాకాంక్షలకు అఖిల్ రిప్లై ఇస్తూ థాంక్ యూ సామ్ మీ అంచనాలను అందుకుంటానని అనుకుంటున్నా అంటూ హార్ట్ ఎమోజీలను షేర్ చేస్తూ సమంత పోస్టుకు రిప్లై ఇచ్చారు. ఇలా అఖిల్ సమంత పోస్టుకు రిప్లై ఇవ్వడంతో సమంత నాగచైతన్యను దూరం పెట్టిన ఇతర కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఉన్నారని తెలుస్తుంది. ప్రస్తుతం అఖిల్ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus