అక్కినేని మూడోతరం హీరో అఖిల్.. హీరోగా ఎంట్రీ ఇచ్చి ఐదేళ్లు పూర్తికావస్తున్నా.. ఇంకా సరైన సక్సెస్ ను అందుకోలేకపోయాడు. ఇప్పటి వరకూ సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ తో పనిచేసిన అఖిల్… ఇప్పుడు ప్లాపుల్లో ఉన్న ‘బొమ్మరిల్లు’ భాస్కర్ డైరెక్షన్లో ఓ చిత్రం చేస్తున్నాడు. ‘జిఏ2 పిక్చర్స్’ బ్యానర్ పై బన్నీ వాస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ కావడం విశేషం. గోపి సుందర్ సంగీత దర్శకుడు. ఇప్పటికే మొదటి సింగిల్ ను విడుదల చేశారు.
దానికి మంచి ఆధారణ కూడా దక్కింది. ఈ చిత్రానికి సంబంధించి 60శాతం షూటింగ్ కూడా పూర్తయ్యింది. నిజానికి సమ్మర్ లో ఈ చిత్రాన్ని విడుదల చేసే దిశగా ప్లాన్ చేసారు కానీ వైరస్ మహమ్మారి కారణంగా కుదర్లేదు. ఇక ఈ లాక్ డౌన్ వల్ల.. నాలుగు నెలల పాటు షూటింగ్ కు కూడా బ్రేక్ పడింది. ఇదిలా ఉండగా.. ఈ చిత్రం నుండీ టీజర్ ను అతి త్వరలో విడుదల చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారట. అందుతోన్న సమాచారం ప్రకారం..
ఆగష్ట్ 29న లేదా ఆ ముందు రోజు సాయంత్రం ఈ చిత్రం టీజర్ ను విడుదల చేసే అవకాశం ఉందట. ఆగష్ట్ 29న.. అఖిల్ తండ్రి నాగార్జున పుట్టినరోజు కావడంతో అక్కినేని అభిమానులకు ఈ చిత్రం టీజర్ ను.. గిఫ్ట్ గా ఇవ్వాలని ‘బ్యాచిలర్’ టీం ట్రై చేస్తున్నట్టు వినికిడి.