ఎన్నో అంచనాల మధ్య తెరమీదికొచ్చిన ‘అఖిల్’ ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమయ్యాడు. ఫలితంగా అక్కడికి చాలాకాలం వరకు రెండో సినిమా ప్రస్తావన కూడా రాలేదు. ఒకరిద్దరు దర్శకులతో చర్చలు జరిగినా అవి చర్చలకే పరిమితం అయ్యాయి. చివరికి విక్రమ్ కుమార్ ఎంట్రీతో కథ ఓ కొలిక్కి వచ్చింది. దీంతోపాటు ఆ కథ ఎలా ఉంటుంది అన్న ఆసక్తీ మొదలైంది. తొలి సినిమాలా ఎలాంటి జిమ్మిక్కులు లేకుండా ఈ కథ ఉండబోతుందట.
విక్రమ్ సినిమాల కథలు ఒక్కసారి పరిశీలిస్తే గనక రొటీన్ కు భిన్నంగా ఉంటాయి. ఈ సినిమా కోసం విక్రమ్ సిద్ధం చేసిన లైన్ అక్కినేని వారికి తెగ నచ్చేసిందట. చిన్నప్పుడే హీరో హీరోయిన్ తమ సొంత తల్లిదండ్రుల నుండి విడిపోయి హీరో హీరోయిన్ తరఫు వారి వద్ద, హీరోయిన్ హీరో తల్లి దండ్రుల దగ్గర పెరుగుతారట. వాళ్ళ కుటుంబాలు కూడా ఒకటి హిందూ, మరోటి ముస్లిం. పెరిగి పెద్దయ్యాక ఇద్దరి మధ్యా ప్రేమాయణం. తద్వారా పిల్లలు సొంత తల్లిదండ్రులకే అల్లుడు, కోడలుగా పరిచయం కావడం. ఈ తరహా కథలకు విక్రమ్ తనదైన కథనం జోడించి ప్రేక్షకులచే మంచి మార్కులు వేయించుకుంటాడని నాగ్ నమ్మకంగా ఉన్నారట. ఇష్క్, మనం సినిమాలకు మాటల రచయితగా పనిచేసిన నటుడు హర్షవర్ధన్ ఈ సినిమాకి సంభాషణలు అందించనున్నారు.