ఎన్టీఆర్ అలా మాట్లాడతాడనుకోలేదు : అఖిల్

‘అఖిల్’ ‘హలో’ చిత్రాలు నిరాశపరచడంతో ఈ సారి ఎలాగైనా సరే హిట్టు కొట్టాలనే కసితో ‘మిస్టర్ మజ్ను’ చిత్రంతో వస్తున్నాడు అఖిల్. వెంకీ అట్లూరి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 25 న (రేపు) విడుదల కాబోతుంది. ఇటీవల జరిగిన ‘మిస్టర్ మజ్ను’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు జూ.ఎన్టీఆర్ ప్రత్యేక అతిధిగా విచ్చేసి .. అఖిల్ కి ఆత్మ విమర్శ చేసుకున్నే ధైర్యం ఉందని.. భవిష్యత్తులో అఖిల్ మంచి నటుడు అవుతాడని.. ఆ రోజు కోసం అక్కినేని అభిమానులతో పాటు నేను కూడా ఎదురుచూస్తానని.. అంటూ అఖిల్ పై ప్రశంసల జల్లు కురిపించాడు తారక్.

తాజాగా ‘మిస్టర్ మజ్ను’ ప్రమోషన్లలో భాగంగా మీడియా తో ముచ్చటించిన అఖిల్… ఈ విషయం పై స్పందించాడు. అఖిల్ మాట్లాడుతూ.. “జనరల్ గా బయట తారక్ నాకు అలాంటి కాంప్లిమెంట్స్ ఇవ్వడు. కానీ ఆడియో వేడుకలో మాత్రం నా గురించి మాట్లాడుతూ చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చేసాడు. తారక్ అలా మాట్లాడినందుకు చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను…” అంటూ అఖిల్ చెప్పుకొచ్చాడు. ‘తొలిప్రేమ’ వంటి సూపర్ హిట్ ఇచ్చిన వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన చిత్రం కావడంతో…. అక్కినేని అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్,ట్రైలర్ లకు మంచి స్పందన దక్కింది. తాజాగా ‘మిస్టర్ మజ్ను’ ట్రైలర్ బాగుందంటూ రాంచరణ్ కూడా స్పందించాడు. మరి తారక్, చరణ్ ల నమ్మకాన్ని అఖిల్ ఎంతవరకూ నిలబెడతాడో చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus