బిగ్ బాస్ 4: అభిజిత్ ఫుల్ ఫైర్..!

బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ 11వ వారం హీటెక్కాయి. నువ్వెంత అఫ్ట్రాల్ అంటే, నువ్వెంత అనుకున్నారు అఖిల్ ఇంకా అభిజిత్ ఇద్దరూ. అఖిల్ నామినేషన్స్ ని అభిజిత్ తో స్టార్ట్ చేస్తూ మటన్ షాప్ జోక్ ని ఇమిటేట్ చేశాడు. సీక్రెట్ రూమ్ లోకి వెళ్లిన మేక ప్రోటీన్స్ తిని పులిలా బయటకి వచ్చింది. ఇప్పుడు కెప్టెన్ అయ్యి నీ ముందు ఉంది అంటూ రెచ్చిపోయాడు. ఖచ్చితంగా అభిజిత్ అన్నమాటలకి హర్ట్ అయ్యి, మనసులో పెట్టుకుని కావాలనే నామినేట్ చేశాడు. ఇదే రీజన్ కూడా చెప్పాడు. అంతేకాదు, మద్యలో లాస్ట్ టైమ్ లాగానే మోనాల్ ని కూడా తీస్కుని వచ్చే ప్రయత్నం చేశాడు. ఇక్కడే అభిజిత్ కి ఇంకా అఖిల్ కి సాలిడ్ గా పడింది. మేక ఎంత ప్రోటీన్ తిన్నా కూడా పులి అవ్వదు.. బలి అవుతుంది అంటూ సూపర్ కౌంటర్ వేశాడు అభిజిత్.

ఇద్దరూ డైలాగ్స్ తో, కౌంటర్స్ తో మాటల తూటాలు పేల్చుకున్నారు. నువ్వు పాతికేళ్లలో చూసింది నేను 32యేళ్లలో చూసా వెళ్లి గమ్మున కూర్చో, ఏదైనా ఉంటే ఇంటిదగ్గర ఉండి గేమ్స్ ఆడుకో అంటూ అభిజిత్ అఖిల్ తో ఆడుకున్నాడు. నిజానికి ఇది ప్రోమో వచ్చినపుడే పులి స్టోరీ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యింది. ఎపిసోడ్ లో మాటలయుద్ధం జరిగేసరికి ఎవరు పులి ? ఎవరు బలి ? అంటూ కామెంట్స్ అడుగుతున్నారు బిగ్ బాస్ లవర్స్ అందరూ.

మెజారిటీగా అఖిల్ ని మేకతో పోల్చుతూ అభిజిత్ ని పులితో పోలుస్తున్నారు. అంతేకాదు, అభిజిత్ పులిగా ఉన్నఫోటోస్ ని మార్ఫింగ్ చేసి మరీ షేర్లు చేస్తున్నారు. ఇక అఖిల్ తనకి తానే మేక అని ఒప్పుకుని తర్వాత ప్రోటీన్ తిన్నా పులి అయ్యా అంటే ఏం చేసినా కూడా మేక బలే అవుతుంది అఖిల్ అంటూ అభిజిత్ అన్నమాటలతో ఇప్పుడో సోషల్ మీడియా హీటెక్కిపోతోంది. మరో మేటర్ ఏంటంటే, అభిజిత్ ఇప్పుడు వరుసగా నామినేట్ అవుతూ కౌషల్ రికార్డ్ ని బ్రేక్ చేస్తున్నాడని కూడా అంటున్నారు. అదీ మేటర్.

Most Recommended Video

ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus