బిగ్‌బాస్ ఇంట్లో ఏదీ శాశ్వతం కాదు. వచ్చినవాళ్లు ఈ వారం కాకపోతే వచ్చేవారం వెళ్లిపోతారు. ఇంకా లేదంటే ఆఖరి వారంలో వెళ్లిపోతారు. అయితే ఒకటి మాత్రం శాశ్వతం. అదే స్నేహం. ఒకరికొకరు పరిచయం లేకపోయినా… ఇంట్లోకి వచ్చి కుటుంబసభ్యులుగా మెలుగుతారు. గొడవలు వస్తాయి.. సమసిపోతాయి. అయితే ఆ గొడవలు ఎంత సీరియస్, వాటిని ఎంతవరకు తీసుకోవాలని అనేది చూడాలి. ఇంటి సభ్యుల్లో అలా చిన్న చిన్న వాటికి గొడవలు పడుతున్న వ్యక్తి అఖిల్.
శుక్రవారం టెలీకాస్ట్ అయిన బిగ్‌బాస్ ఎపిసోడ్ చూస్తే చాలామంది మేం చెప్పిన విషయంలో క్లారిటీ వస్తుంది. అఖిల్ ఇంట్లోకి వచ్చింది మొదలు.. టచ్ మీ నాట్ స్టయిల్‌లోనే ఉంటున్నాడు. క్లోజ్‌సర్కిల్ మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు. ఎక్కువ సేపు మాట్లాడేది ఎవరైనా ఉన్నారంటే అది మోనాల్ ఒక్కరే. ఇప్పుడిప్పుడు దివితో కాస్త మాట్లాడుతున్నాడు. అయితే అతను మాట్లాడని వాళ్లలో చాలామంది గతంలో మాట్లాడినవాళ్లే.
గత కొన్ని రోజులుగా అఖిల్, సోహైల్, మెహబూబ్ కలిసే ఉంటున్నారు. ప్రతి విషయంలో ఒకరికొకరు సాయం చేసుకుంటున్నారు. అలాగే ఏదైనా జరిగితే ముగ్గురూ ఒకటైపోతున్నారు. అయితే రెండు రోజులుగా పరిస్థితి మారింది. మొన్నెప్పుడో మోనాల్ గురించి ఏదో అన్నాడని మెహబూబ్ విషయంలో అలిగాడు అఖిల్. అప్పుడు సోహైల్ సర్ది చెప్పాడు. నిన్న జరిగిన పుషప్స్ టాస్క్‌లో మెహబూబ్ ఏదో అన్నాడని మళ్లీ అలిగాడు. ‘నేను 60 పుషప్స్ తీసేలోగా అఖిల్ 101 కొట్టాడా’ అని మోహబూబ్ దివితో అన్నాడట. ఆ విషయం ఆమె అఖిల్ దగ్గర ఉంది. దీంతో హర్ట్ అయ్యాడట. ఇక్కడి వరకు ఓకే.
మరి మెహబూబ్ మాటకు హర్ట్ అయితే.. సోహైల్‌తో చెప్పడం ఎంత కరెక్టో. అంతేకాదు మెహబూబ్ మీద కోపం వచ్చింది కాబట్టి నీ మీద కోపం వచ్చింది అంటూ సోహైల్ మీద విసుక్కున్నాడు అఖిల్. ఈ లాజిక్ అర్థం కాక సోహైల్, బయట చూస్తున్న జనాలు తల గోక్కుంటున్నారు. మోనాల్‌తో కూడా మాట్లాడుతున్నాడే కానీ… రెండు రోజులకొకసారి హర్ట్ అయిపోతుంటాడు. దీంతో ఆ రిలేషన్ కూడా అంతంతమాత్రమే. తొలినాళ్లలో అభిజీత్ కూడా ఇలాంటిదే జరిగింది. అభిజీత్ క్యాజువల్‌గా అన్న మాటను పట్టుకొని పెద్ద రచ్చే చేస్తున్నాడు అఖిల్. చూద్దాం ఇంకా అఖిల్‌ను హర్ట్ చేసేవారిలో చేరుతారో.