Akhil: ఆవు పాల కోసం తిప్పలు..! అసలు మేటర్ ఇదే..!

బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో ఆవుపాల కోసం హౌస్ మేట్స్ కొట్టుకున్నారు. బిగ్ బాస్ ఓటింగ్ అప్పీల్ లో భాగంగా ఆవుపాలు కలక్ట్ చేయమని, ఎవరు ఎక్కువ సీసాలు నింపితే వాళ్లు నేరుగా ఆడియన్స్ ని ఓట్ అప్పీల్ చేయమని అడగచ్చని చెప్పారు. దీంతో టాస్క్ లో రెచ్చిపోయి మరీ గేమ్ ఆఢారు హౌస్ మేట్స్. ఇక ఇదే హౌస్ లో లాస్ట్ టాస్క్ అన్నట్లుగా ఆడారు. ఇక్కడే నటరాజ్ మాస్టర్ కి ఇంకా అఖిల్ కి గట్టి ఆర్గ్యూమెంట్ అయ్యింది.

ఆవు దగ్గర పాలు తీస్తుంటే మాస్టర్ క్యాన్ ని తోసేశారని, చేయి పెట్టి గట్టిగా అడ్డుపెట్టేశారని అఖిల్ మాట్లాడాడు. మీకోసం ఎంత చేసినా సంతృప్తి ఉండదంటూ అఖిల్ ఫైర్ అయ్యాడు. దీంతో మాస్టర్ మాటకి మాట చెప్పారు. ఇద్దరూ కాసేపు వాదించుకున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అనేవరకూ వెళ్లిపోయారు. అఖిల్ కీలకమైన సమయంలో తనకి హెల్ప్ చేయలేదని నటరాజ్ మాస్టర్ అభిప్రాయ పడ్డాడు. నేను నా టాలెంట్ తోనే గెలుచుకున్నాను అని, ఎవ్వరి సపోర్ట్ అక్కర్లేదు అంటూ రెచ్చిపోయి మరీ మాట్లాడారు.

నీ దొంగ బుద్ది చూపించావ్ అని, ఫ్లవర్స్ టాస్క్ లో అనిల్ కి హెల్ప్ చేసినపుడే నువ్వేంటో బయటపడిందని నిందించారు. ఇక మాస్టర్ కి ఆవేశంగా ఆన్సర్ చెప్తూ అనిల్ కూడా బిగ్ బాస్ కొత్తగానే వచ్చాడని , సపోర్ట్ చేయడం తప్పేం కాదని, లాస్ట్ టాస్క్ లో నాతోపాటు ఉన్నాడు కాబట్టే హెల్ప్ చేశానని వాదించాడు. అఖిల్ – నటరాజ్ మాస్టర్ ఒక రేంజ్ లో కొట్టుకుంటుంటే, బాబాభాస్కర్ ఒక్కరే వారించే ప్రయత్నం చేశాడు.

నిజానికి మాస్టర్ కి టాస్క్ లో సపోర్ట్ చేస్తే మంచోళ్లు, లేదంటే మాత్రం వాళ్లని శత్రువుల్లా చూస్తారు అంటూ అఖిల్ మాట్లాడాడు. తేజస్వి విషయంలో కూడా ఇదే జరిగిందని గుర్తు చేశాడు. అలాగే, అఖిల్ పాయింట్ టు పాయింట్ మాట్లాడి మాస్టర్ చేసింది కరెక్ట్ కాదని మాట్లాడాడు. తర్వాత పీచ్ రూమ్ లో కూర్చుని చాలాసేపు బాధపడ్డాడు అఖిల్. ఏది ఏమైనా గేమ్ చివరికి వచ్చేసిన ఈ టైమ్ లో వీరిద్దరి మద్యలో ఆర్గ్యూమెంట్ అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదీ మేటర్.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

10 ఏళ్ళ ‘గబ్బర్ సింగ్’ గురించి 12 ఆసక్తికరమైన విషయాలు..!
‘చెల్లమ్మ’ టు ‘మ మ మహేషా’.. జోనిత గాంధీ పాడిన 10 సూపర్ హిట్ పాటల లిస్ట్..!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus