Akhil: చిరంజీవి ప్లేస్‌లోకి అఖిల్ వస్తున్నాడా.. నిర్మాత ఆలోచన ఇదేనా?

అఖిల్‌కు సరైన హిట్‌ పడలాని కోరుకోని వాళ్లు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ఎన్నో ఏళ్లుగా సరైన విజయం కోసం అఖిల్‌ ఎదురుచూస్తున్నాడు. ‘మోస్ట్‌ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌’ సినిమా విజయం అందుకున్నా.. అందులో ఎక్కువ భాగంగా పూజా హెగ్డేకే వెళ్లింది అనుకోవచ్చు. దీంతో మాస్‌ హీరో ఇమేజ్‌ కోసం చూస్తున్న అఖిల్‌కి ‘ఏజెంట్‌’ సినిమా రావాల్సిందే అనేది అభిమానుల కోరిక. తాజాగా ఈ సినిమా గురించి రెండు ఆసక్తికర అప్‌డేట్స్‌ బయటకు వచ్చాయి. వాటి ప్రకారం చూస్తే.. అభిమానులకు త్వరలో తీపి కబురు పక్కా అంటున్నారు.

దర్శకుడు సురేందర్ రెడ్టి ‘ఏజెంట్’ సినిమాను చాలా రోజుల నుండి తెరకెక్కిస్తున్నారు. రీషూట్లా, రిపేర్లా అనేది తెలియదు కానీ.. సినిమా అయితే ఇంకా చిత్రీకరణ దశలోనే ఉంది. ఈ క్రమంలో సినిమా బడ్జెట్‌ రూ. 40 కోట్ల ప్రాజెక్టు కాస్త రూ. 80 కోట్ల సినిమాగా మారిపోయింది. సంక్రాంతికి వచ్చి మొత్తంగా సంపాదిద్దాం అనుకున్నారు. కానీ అదీ కుదర్లేదు. దీంతో సమ్మర్‌ ఆలోచనలో ఉన్నారట నిర్మాత అనిల్‌ సుంకర. దీని కోసం చిరంజీవి సినిమా కాస్త ఆలస్యమవుతుంది అంటున్నారు.

దీంతో అదే నిర్మాణ సంస్థలో రూపొందుతున్న ‘భోళా శంకర్‌’ను వాయిదా వేయాలని చూస్తున్నారట. మహేష్‌ బాబు సినిమా కూడా ఇప్పట్లో లేకపోవడంతో అఖిల్‌ సినిమాను ఏప్రిల్‌ ఆఖరున తీసుకొచ్చేలా ప్రయత్నాలు సాగుతున్నాయట. త్వరలో డేట్‌ అనౌన్స్‌మెంట్‌ ఇస్తారట. ఇక సినిమా సంగతికొస్తే.. విదేశాల్లో ఓ ఛేజ్‌ సీన్‌ తీయాల్సి ఉందట. దాంతో షూటింగ్‌ పూర్తి అంటున్నారు. పోస్ట్ ప్రొడక్షన్‌తో కలిపి ఏప్రిల్ నాటికి సినిమా రెడీ అవుతుందట.

ఇక రెండో అప్‌డేట్ ఏంటి అంటే.. అనిల్‌ సుంకర ఈ సినిమా కోసం పెట్టి ఖర్చు, కష్టం చూసి అఖిల్‌ తన తర్వాతి సినిమాను కూడా ఇదే బ్యానర్‌లో చేయాలి అనుకుంటున్నారట. ఈ విషయం కూడా త్వరలో అనౌన్స్‌ చేస్తారు అంటున్నారు. దర్శకుడు తదితర వివరాలు ఆ రోజు బయటకు వచ్చే అవకాశ ఉంది. కుదిరితే ‘ఏజెంట్‌’ రిలీజ్‌ డేట్‌, కొత్త సినిమా విషయం ఒకేరోజు బయటకు రావొచ్చు.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus