ప్రీ లుక్ తో అదరగొడుతున్న అఖిల్

తొలిప్రేమ సినిమాతో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ మూడో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం లండన్లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ షూటింగ్ లో అఖిల్ తో పాటు హీరోయిన్ నిధి అగర్వాల్, ప్రధాన పాత్ర దారులు పాల్గొంటున్నారు. అఖిల్ ప్లే భాయ్ గా కనిపించనున్న ఈ చిత్రానికి నాగార్జున హిట్ మూవీ మజ్ను అనే పేరుని ఫిక్స్ చేసినట్లు కొన్నిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై మనకు మరో మూడురోజుల్లో క్లారిటీ రానుంది. ఎందుకంటే అప్పుడే ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నారు కాబట్టి.  19 న సాయంత్రం నాలుగు గంటలకు ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తామని చెబుతూ ప్రీ లుక్ రిలీజ్ చేశారు. అఖిల్ రెండు చేతులు షారూఖ్ ఖాన్ స్టైల్ లో అలా చాపి ఒక పోజిచ్చాడు.

చూస్తుంటే ఇది ఒక పాటలోని డాన్స్ స్టిల్ లా ఉంది. ప్రీ లుక్కే ఇలా ఉంటే ఫస్ట్ లుక్ ఇంకా సూపర్ గా ఉంటుందని అభిమానులు అంచనా వేస్తున్నారు.  ఈ ప్రీలుక్ ను తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేసిన అఖిల్ “మీరు రెడీనా.. మేము రెడీ.. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది” అంటూ ట్వీట్ చేశారు. అఖిల్ బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. అతని మొదటి చిత్రం అఖిల్ పూర్తిగా నిరాశపరిచింది. తర్వాత విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన హలో సినిమా ఫరవాలేదనిపించింది. ఈసారి ఈ మూవీతో రికార్డులు బద్దలు కొట్టాలని చూస్తున్నారు. డిసెంబర్లో థియేటర్లోకి రానున్న ఈ సినిమా ఎంతమేర విజయం సాధిస్తుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus