Agent First Review: ‘ఏజెంట్’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

అక్కినేని అఖిల్ హీరోగా స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఏజెంట్’. ‘ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్’, ‘సురేందర్ 2 సినిమా’ పతాకాలపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ప్రమోషన్లలో భాగంగా విడుదల చేసిన ఫస్ట్ గ్లిమ్ప్స్, టీజర్, ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ నమోదుచేశాయి. హిపాప్ తమిళ సంగీతంలో రూపొందిన పాటల్లో ‘వైల్డ్ సాలా’ సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ట్రైలర్ అయితే హాలీవుడ్ సినిమాలను తలపించింది.

అసలు ఈ అఖిల్ లుక్ లో హాలీవుడ్ హీరోలా ఉన్నాడు అని చెప్పాలి. అందుకే నిర్మాత కూడా రూ.80 కోట్ల బడ్జెట్ ను పెట్టాడు. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మలయాళం స్టార్ హీరో మమ్ముట్టి కూడా నటించడం వల్ల అక్కడ కూడా భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు . ఈ విషయాలను ఇలా పక్కన పెట్టేస్తే ఫేక్ రివ్యూలు ఇచ్చే ఉమైర్ సంధు ‘ఏజెంట్’ సినిమాని చూసేసినట్టు తెలిపి తన రివ్యూ చెప్పాడు.

‘ఏజెంట్’ సినిమా ‘సోల్ లేని బ్యూటిఫుల్ బాడీ’ అంటూ పేర్కొన్న ఉమైర్ సంధు.. యాక్షన్ ఎపిసోడ్స్ అద్భుతంగా ఉన్నాయని, కానీ స్టోరీ, స్క్రీన్ ప్లే బాలేదని తెలిపాడు. మమ్ముట్టి మాత్రం చాలా బాగా నటించాడని, అఖిల్ అక్కినేని యాక్టింగ్ క్లాసులు తీసుకోవాలని కూడా విమర్శలు చేశాడు ఉమైర్ సంధు. ‘ఏజెంట్’ సినిమాకి అతను 2.5 /5 రేటింగ్ ఇచ్చాడు. ఇంతకు మించి అతను చెప్పింది ఏమీ లేదు. నిజానికి ‘ఏజెంట్’ సినిమా కథ ఇది అని అతను చెప్పింది ఏమీ లేదు.

అతను ప్రతి రివ్యూ కి ఇలాగే చెబుతాడు. ఒకప్పుడు అన్ని సినిమాలకు పాజిటివ్ టాక్ ఇస్తూ రావడం వల్ల ఇతని రివ్యూలు జనాలు పట్టించుకోవడం మానేసారు. అందుకే ఇప్పుడు నెగిటివ్ రివ్యూలు ఇవ్వడం మొదలుపెట్టాడు. ఇలా నెగిటివ్ గా రివ్యూలు ఇవ్వడం వల్ల ఎక్కువ క్లిక్స్ వస్తున్నట్టు ఉన్నాయి. అదే కంటిన్యూ చేస్తున్నాడు.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus