Akhil: అఖిల్ కొత్త లుక్ అదిరిపోయిందిగా.. భలే ఉన్నాడంటూ?

అక్కినేని హీరో అఖిల్ కు (Akhil Akkineni) ప్రేక్షకులలో ఏ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న వయస్సులోనే సిసింద్రీ (Sisindri) సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అఖిల్ కు హీరోగా ఆశించిన విజయం దక్కడం లేదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ (Most Eligible Bachelor) మినహా అఖిల్ సినిమాలన్నీ నిర్మాతలకు నష్టాలను మిగిల్చాయి. ఏజెంట్ (Agent) సినిమా కలెక్షన్ల పరంగా కూడా ప్రేక్షకులను భారీ స్థాయిలో నిరాశకు గురి చేసింది. అఖిల్ తర్వాత మూవీ యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కనుందని తెలుస్తోంది.

ఈ సినిమాకు అనిల్ అనే దర్శకుడి పేరును పరిశీలిస్తున్నారని ఈ సినిమాకు ధీర అనే టైటిల్ ఫిక్స్ అయ్యే ఛాన్స్ అయితే ఉందని సమాచారం అందుతోంది. అఖిల్ గడ్డం పెంచి గుర్తు పట్టలేని లుక్ లో కనిపించగా తర్వాత మూవీ పీరియాడికల్ డ్రామా అని అందుకే అఖిల్ లుక్ ను పూర్తిగా మార్చుకున్నారని సమాచారం. అఖిల్ భవిష్యత్తు సినిమాలు సైతం పాన్ ఇండియా సినిమాలుగానే తెరకెక్కనున్నాయని భోగట్టా.

కెరీర్ పరంగా ఏడాది గ్యాప్ తీసుకున్న అఖిల్ ఇకపై వేగంగా సినిమాల్లో నటించేలా ప్లాన్ చేసుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. నాగార్జున (Nagarjuna) సైతం అఖిల్ కెరీర్ పరంగా సక్సెస్ సాధించేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. అక్కినేని అఖిల్ రెమ్యునరేషన్ విషయంలో కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నారని లాభాల్లో వాటా తీసుకునేలా నిర్మాతలతో ఒప్పందాలు చేసుకుంటున్నారని సమాచారం అందుతోంది.

అక్కినేని అఖిల్ క్లాస్ ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అఖిల్ పాన్ ఇండియా డైరెక్టర్ల డైరెక్షన్ లో నటించబోతున్నారని కామెంట్లు వినిపిస్తుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. అఖిల్ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే కథలపై ఫోకస్ పెట్టాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నాగ్, అఖిల్ కాంబోలో సినిమాలు రావాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. అఖిల్ కొత్త లుక్ లో భలే ఉన్నాడని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags