Akshay, Rajinikanth: రజనీకాంత్ ను సత్కరించిన ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు?

ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ దినోత్సవం సందర్భంగా ఆదాయపు పన్ను శాఖ ఈ ఏడాది ఎక్కువ మొత్తంలో ట్యాక్స్ చెల్లించిన వారిగా నటులు అక్షయ్ కుమార్,రజినీ కాంత్ ల పేర్లను ప్రకటించడమే కాకుండా, వీరిద్దరినీ ఘనంగా సత్కరించింది. తమిళ చిత్ర పరిశ్రమ నుంచి అత్యధికంగా టాక్స్ చెల్లించే వారిలో రజినీకాంత్ మొదటి స్థానంలో ఉన్నారు. అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీలో అక్షయ్ కుమార్ అత్యధిక టాక్స్ చెల్లించే నటుడుగా ఇన్కమ్ టాక్స్ అధికారులు వెల్లడించారు.

ఈ విధంగా ఈ ఏడాది అత్యధికంగా ఇన్కమ్ టాక్స్ చెల్లించిన నటులుగా పేరు సంపాదించిన అక్షయ్ కుమార్ రజనీకాంత్ ఆస్తుల గురించి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.తమిళ సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని విశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్న నటుడు రజనీకాంత్ ఒక్కో సినిమాకు కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటూ భారీగా ఆస్తులు సంపాదించారు. ఈయన ఎన్నో ఆస్తులను కూడా పెట్టినప్పటికీ ఎప్పుడూ ఒక సాధారణమైన వ్యక్తిలా ఎప్పుడు గొప్పలు చెప్పుకోలేదు.

ఇక రజనీకాంత్ ఖరీదైన బంగ్లాలు కార్లు వంటి వాటిని పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. ఇకపోతే సెలబ్రెటీ నెట్ వర్త్ పై పలు సర్వేలలో భాగంగా రజనీకాంత్ నికర ఆస్తుల విలువ దాదాపు 365 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తులు కూడా కొన్ని వందల కోట్లలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా ఈయన వందల కోట్ల ఆస్తి కలిగి ఉండటమే కాకుండా ఈయన సరైన సమయంలో ప్రభుత్వానికి పన్ను చెల్లించడంతో ఆదాయపు పన్ను శాఖ వారు వీరిని ఘనంగా సత్కరించారు.

ఇకపోతే గత ఐదు సంవత్సరాల నుంచి బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక పన్ను చెల్లింపు దారుడిగా అక్షయ్ కుమార్ వార్తలలో నిలిచారు. ఇకపోతే ఈయన ఆస్తులు విషయానికి వస్తే ఈయన నికర ఆస్తులు విలువ సుమారు 370 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. స్థిర చరాస్తులు కూడా వందల కోట్లలో ఉన్నట్లు తెలుస్తుంది.ఇకపోతే ఈ నటుడికి ఇండియాలో పాటు కెనడాలో కూడా ఖరీదైన బంగ్లాలు కార్లు ఉన్నట్లు సమాచారం.

ఈయన కోసం ప్రత్యేకంగా 200 కోట్ల రూపాయల ప్రైవేటు జట్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఇలా సినిమాలలోను అలాగే పలు యాడ్స్ ద్వారా అక్షయ్ కుమార్ భారీగా ఆస్తులను సంపాదించి సరైన సమయానికి ప్రభుత్వానికి టాక్స్ చెల్లించడంతో గత ఐదు సంవత్సరాల నుంచి అత్యధికంగా ప్రభుత్వానికి టాక్స్ చెల్లించే వ్యక్తిగా అక్షయ్ కుమార్ నిలిచారు.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus