Akshay Kumar: ఆమెను గుర్తు చేసుకుని అక్షయ్ ఎమోషనల్.. అలా జరగడంతో?

బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన అక్షయ్ కుమార్ నటించిన రక్షా బంధన్ సినిమా ఈ నెల 11వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా అదే రోజున థియేటర్లలో విడుదలవుతున్నప్పటికీ అక్షయ్ కుమార్ మాత్రం తన సినిమా రిజల్ట్ పై ఉన్న కాన్ఫిడెన్స్ వల్ల రక్షా బంధన్ సినిమాను అదేరోజున థియేటర్లలో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అక్షయ్ కుమార్ సూపర్ స్టార్ సింగర్2 అనే ప్రోగ్రాంలో పాల్గొన్నారు.

సూపర్ స్టార్ సింగర్2 ప్రోగ్రాంలో అక్షయ్ కుమార్ ను చూసిన ఆనందంలో ఒక అమ్మాయి పాట పాడటంతో పాటు ఆ పాటను అక్షయ్ కుమార్ కు అంకితం చేసింది. ఆమె ఆ పాట పాడే సమయంలో అక్షయ్ కుమార్ తన సోదరితో కలిసి రక్షా బంధన్ ను జరుపుకున్న ఫోటోలతో పాటు పాత ఫోటోలను షోలో ప్రదర్శించడం జరిగింది. ఆ ఫోటోలను చూసిన అక్షయ్ కుమార్ సోదరిని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు.

అక్షయ్ కుమార్ రక్షాబంధన్ మూవీతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరోవైపు కనికా ధిల్లాన్ ఈ సినిమాకు రచయితగా వ్యవహరించడంతో రక్షాబంధన్ సినిమాను బ్యాన్ చేయాలని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. రెండు సంవత్సరాల క్రితం కనికా చేసిన ట్వీట్లను కొంతమంది ప్రస్తుతం షేర్ చేస్తూ ఈ సినిమాకు నెగిటివ్ పబ్లిసిటీ చేస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన రక్షాబంధన్ ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అక్షయ్ వేగంగా సినిమాలు చేయడం కంటే మంచి సినిమాలు చేయడంపై దృష్టి పెడుతున్నారు. సినిమాసినిమాకు అక్షయ్ కుమార్ పారితోషికం ఊహించని స్థాయిలో పెరుగుతుండటం గమనార్హం. అక్షయ్ కుమార్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలను సొంతం చేసుకోవాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus