ఐదు సంవత్సరాల నుంచి అత్యధిక పన్ను చెల్లింపుదారుడిగా నిలిచిన హీరో?

సాధారణంగా మన వార్షిక ఆదాయాన్ని బట్టి ప్రభుత్వానికి పన్ను కట్టాల్సి ఉంటుంది. మన ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మనకు టాక్స్ విధిస్తూ ఉంటుంది. ఇలా ఎన్నో రంగాలలో అత్యధికంగా డబ్బు సంపాదించేవారు ప్రభుత్వానికి తప్పనిసరిగా ప్రతి ఏడాది టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఇకపోతే సినిమా ఇండస్ట్రీకి చెందినవారు పెద్ద ఎత్తున టాక్స్ లు చెల్లిస్తూ ఉంటారు.అయితే సినిమా ఇండస్ట్రీలో అత్యధికంగా టాక్స్ చెల్లించే హీరో గురించి ప్రస్తుతం పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

సినిమా ఇండస్ట్రీలో అత్యధికంగా టాక్స్ చెల్లించే హీరోగా అక్షయ్ కుమార్ పేరు సంపాదించారు. ఈయన గత ఐదు సంవత్సరాల నుంచి ప్రభుత్వానికి అత్యధికంగా టాక్స్ చెల్లింపుదారుడిగా నిలిచారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది కూడా అత్యధికంగా పన్ను చెల్లింపు దారుడిగా నిలబడటంతో ఆదాయపు పన్ను శాఖ నటుడు అక్షయ్ కుమార్ కు సమ్మాన్ పత్ర, గౌరవ ధృవీకరణ పత్రాన్ని కూడా ఇచ్చింది. ప్రస్తుతం ఈ ధ్రువీకరణ పత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర నటుడుగా కొనసాగుతున్నటువంటి అక్షయ్ కుమార్ ప్రతి ఏడాది మూడు నాలుగు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈయన హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలకు కమిట్ అవ్వడమే కాకుండా భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఉన్నారు.ఈ విధంగా అక్షయ్ కుమార్ సంపాదన అధికమవడంతో ఈయన ప్రభుత్వానికి అత్యధికంగా టాక్స్ చెల్లిస్తూ ఉన్నారు.

ఇకపోతే ఈ ఏడాది కూడా ఈయన అత్యధిక టాక్స్ చెల్లింపుధారుడిగా నిలబడటం విశేషం అయితే ఆదాయపు పన్ను శాఖ ధ్రువీకరించిన పత్రాన్ని అందుకోవడానికి అక్షయ్ కుమార్ ప్రస్తుతం ఇండియాలో లేరు. ప్రస్తుతం యుకెలో తిను దేశాయ్‌తో కలిసి సినిమా చేస్తు బిజీగా ఉన్నారు. ఇక ఈయన సినిమా షూటింగ్ తో యూకే లో బిజీగా ఉండడం వల్ల ఆయన తరుపున ఆయన బృందం ఆదాయపు పన్ను శాఖ నుంచి ఈ ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus