అక్షయ్ కుమార్ సినిమాల జోరు గురించి సెటైరికల్ చెప్పాలంటే… ఇతర హీరోలు ఓ సినిమా ప్రీప్రొడక్షన్ కోసం తీసుకున్న సమయంలో సినిమా పూర్తి చేసేస్తాడు. అంత త్వరగా నిర్ణయం, ప్రీ ప్రొడక్షన్, షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ ఉంటాయి. అందుకే ఏటా ఆరేడు సినిమాలు రిలీజ్ చేసేస్తుంటాడు. కరోనా పరిస్థితుల కారణంగా గత కొంతకాలంగా అక్షయ్ నుండి ఒక్క సినిమానే వచ్చింది. అదే ‘లక్ష్మి’.. అది కూడా ఓటీటీలో. ఇప్పుడు బాలీవుడ్ సినిమాల రిలీజ్‌కు మహారాష్ట్ర ప్రభుత్వం ఓకే చెప్పడంతో అక్షయ్ సినిమాలు థియేటర్ ముందు వరుసకట్టనున్నాయి.
అక్షయ్ కుమార్ చేతిలో ప్రస్తుతం ఏడు సినిమాలు ఉన్నాయి. అందులో మూడు సినిమాల చిత్రీకరణ ఇప్పటికే పూర్తవగా, మరో మూడు సినిమాల చిత్రీకరణ సగానికిపైగా పూర్తయిందట. ఇంకో సినిమా కొంత భాగం చిత్రీకరణ పూర్తయింది. ఒకవేళ థియేటర్లు తెరుచుకుంటూ ఈ సినిమాలు వరుస కట్టనున్నాయి. మరీ వారం, వారం అక్షయ్ సినిమాలే వస్తే బాగుండదు కాబట్టి… కనీసం నెలకో సినిమాలు రిలీజ్ చేయొచ్చు. ఆ లెక్కన రాబోయే ఏడెనిమిది నెలలు అక్షయ్ సినిమాలు వస్తూనే ఉంటాయి.
ప్రస్తుతం అక్షయ్ చేతిలో ఉన్న సినిమాలు చూస్తే ‘సూర్యవంశీ’ చాలా కాలం క్రితమే పూర్తయింది. అయితే పెద్ద సినిమా కావడంతో థియేటర్లలోనే విడుదల చేయాలని అనుకుంటున్నారు. అక్షయ్ నుండి వచ్చే తొలి సినిమా ఇదే అవుతుంది. దీని తర్వాత ‘రక్షా బంధన్’, ‘బెల్‌బాటమ్’ ఉన్నాయి. ఈ రెండూ పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉన్నాయి. పనులు మొదలైతే ఒక నెలకే ఇవి సిద్ధం చేయొచ్చని సమాచారం.
వీటితోపాటు ‘అత్రంగి’, ‘బచ్చన్ పాండే’ కూడా సిద్ధం చేశారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించాల్సి ఉంది. ‘రామ్ సేతు’లో కొంత భాగం చిత్రీకరణ అవ్వాల్సి ఉందట. ఇవికాకుండా ‘పృథ్విరాజ్’ అనే మరో భారీ చిత్రం అక్షయ్ చేస్తున్నాడు. దీని చిత్రీకరణ ఎక్కువ భాగమే పెండింగ్ ఉందట. దీనిని పూర్తి చేయడంతోపాటు, ‘రామ్‌సేతు’ కూడా పూర్తి చేయాలని అక్షయ్ చూస్తున్నాడట. దీంతో వరుస రిలీజ్‌లు అయితే ఖాయం. అయితే అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందనేది ఇక్క విషయం.
Most Recommended Video
ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!