Allu Arjun: ‘అల వైకుంఠపురములో’ నుండి ఎవరూ చూడని సీన్‌ మీకోసం!

‘అల వైకుంఠపురములో’ సినిమాలో రాజ్‌, నందిని మధ్య ప్రేమ ఉంటుంది… కానీ ఆఖరి వరకు ఆ విషయం చెప్పరు. యశోధ, రామచంద్రకే కాదు… ప్రేక్షకులకు కూడా చెప్పరు. ఆఖరులో నందిని మీద ప్రేమను చెబుతాడు రాజ్‌ అలియాస్‌ సుశాంత్‌. అక్కడక్కడ చిన్న హింట్స్ ఇచ్చారు. అయితే నిజానికి సినిమా కథను అలా నడిపించాలనుకోలేదు. ముందే వాళ్ల మధ్య ప్రేమను చూపించాలనుకున్నారు దర్శకుడు త్రివిక్రమ్‌. దానికి తగ్గట్టుగా సినిమాలో కొన్ని సీన్స్‌ కూడా ఉన్నాయి.

సినిమా విడుదలైన ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు ఆ సన్నివేశమొకటి బయటికొచ్చింది. అల్లు అర్జున్‌ పుట్టిన రోజు సందర్భంగా గోల్డ్‌మైన్స్ ఫిల్మ్ ఓ డిలీటెడ్‌ వీడియోను రిలీజ్‌ చేసింది. అదేదో అన్ని వీడియోల్లాగా ఒకటి, రెండు నిమిషాల వీడియో కాదు… ఏకంగా సుమారు ఐదు నిమిషాల వీడియో. అంత పెద్ద వీడియోను అలా ఎలా డిలీట్‌ చేశారు అంటారా? ఆ వీడియో సినిమాలో ఉండి ఉంటే ప్రేక్షకుడి మూడ్‌ వేరేలా మారిపోతుంది కాబట్టి.

కావాలంటే ఆ వీడియో చూడండి మీకే తెలుస్తుంది. గోల్డ్‌మైన్స్‌ టెలీఫిల్మ్స్‌ ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో ఈ వీడియోను పోస్ట్‌ చేశారు. పూజా హెగ్డే ఆఫీసుకి సుశాంత్‌, నివేదా పేతురాజ్‌ వస్తారు. పెళ్లికి సంబంధించి కొన్ని విషయాలు మాట్లాడే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో సుశాంత్‌ మీద తనకున్న ప్రేమను చూపించే ప్రయత్నం చేస్తుంది నివేదా. పనిలోపనిగా పూజను ఇబ్బంది పెట్టాలని చూస్తుంది. దీంతో దిక్కుతోక అల్లు అర్జున్‌ సాయం తీసుకుంటుంది పూజ. అయితే మరి అల్లు అర్జున్‌ ఏం చేశాడు.

ఆమెకు అవసరమైన సాయం చేశాడా? అనేది ఆ వీడియోలో చూసి తెలుసుకోవాల్సిందే. 2020 జనవరి 12న విడుదలైన ఈ సినిమా సంక్రాంతి సీజన్‌లో మంచి వసూళ్లు సాధించింది. అల్లు అర్జున్‌ కెరీర్‌లో చాలా గ్యాప్‌ తీసుకున్నాక చేసిన సినిమా కావడం, త్రివిక్రమ్‌ దర్శకత్వంలో హ్యాట్రిక్‌ సినిమా వస్తుండటంతో అంచనాలు బాగానే ఉన్నాయి. అనుకున్నట్లుగానే సినిమా మంచి వసూళ్లతో ఆకట్టుకుంది. సుమారు

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!


‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus