త్రివిక్రమ్ సినిమాలకు ఆయన రచనా శైలికి ఎంత పేరుందో తెలిసిన సంగతే. ఐతే దర్శకుడిగా ఎంత పేరున్నప్పటికీ ఆయన పై తరచూ కాపీ వివాదాలు కూడా వస్తూ ఉంటాయి. పవన్ కళ్యాణ్ హీరోగా ఆయన తెరకెక్కించిన అజ్ఞాతవాసి సినిమా విషయంలో ఆయన తీవ్ర విమర్శలకు గురైయ్యారు. ఆయన ఫ్రెంచ్ మూవీ లార్గోవించ్ కాపీ చేసి అజ్ఞాతవాసి సినిమా తీశారంటూ వార్తలు వచ్చాయి. లార్గోవించ్ దర్శకుడు కూడా త్రివిక్రమ్ పై విమర్శలు చేయడం జరిగింది.
అలాగే నితిన్ తో తెరకెక్కించిన ‘అ ఆ’ మూవీ కూడా రచయిత సులోచన రాణి రాసిన మీనా నవల ఆధారంగా త్రివిక్రమ్ తెరకెక్కించారు. సినిమా విడుదల అయ్యే వరకు ఆయన ఆ విషయం బయట పెట్టలేదు. ఇక సంక్రాంతి బ్లాక్ బస్టర్ అల వైకుంఠపురంలో విషయంలో కూడా త్రివిక్రమ్ పై కాపీ ఆరోపణలు చుట్టూ ముట్టాయి. కృష్ణ అనే సినీ రచయిత త్రివిక్రమ్ పై కంప్లైంట్ ఫైల్ చేసినట్లు తెలుస్తుంది. ఆయన అల వైకుంఠపురంలో మూవీ కథను త్రివిక్రమ్ కి 2005లో కృష్ణ వినిపించాడట. అలాగే 2013లో దశ దిశ పేరుతో ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ చేయించారట. ఈ విషయంలో దర్శకుడు త్రివిక్రమ్ కి లీగల్ నోటీసులు కూడా అందినట్లు తెలుస్తుంది. అల వైకుంఠపురంలో మూవీ విషయంలో కూడా త్రివిక్రమ్ ని వివాదాలు వీడడం లేదు.