కొన్ని సినిమాలు… దర్శకుల విషయంలో జయాపజయాలు దర్శకుల ఖాతాలోకి వెళ్లిపోతాయి. బాహుబలి ఎంత పెద్ద ఆల్ ఇండియా ఆల్ టైం బ్లాక్ బస్టర్ గా నిలిచినా దాని క్రెడిట్ మొత్తం దాదాపు రాజమౌళి ఖాతాలోకే వెళ్ళిపోయింది. ఐతే ప్రభాస్ కి కూడా పాన్ ఇండియా స్టార్ గుర్తింపు మరియు ఇతర దేశాలలో ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. ఇప్పుడు అదే పరిస్థితి అల వైకుంఠపురంలో మూవీ విషయంలో జరుగుతుంది అనిపిస్తుంది. అల వైకుంఠపురంలో 150కోట్ల షేర్ వరకు సాధించి, ఆల్ టైం టాలీవుడ్ టాప్ గ్రాస్సింగ్ మూవీగా నిలిచింది. అల్లు అర్జున్ మరియు దర్శకుడు త్రివిక్రమ్ పేరిట నాన్ బాహుబలి రికార్డ్ నమోదు చేసింది.
ఐతే ఈ చిత్ర విజయంలో బన్నీ పరఫార్మెన్సు, త్రివిక్రమ్ టేకింగ్, థమన్ సాంగ్స్ ప్రధాన పాత్ర పోషించాయి. ఐతే ఈ మూవీ సక్సెస్ క్రెడిట్ మొత్తం త్రివిక్రమ్ ఖాతాలోకి వెళ్ళిపోయింది. బన్నీ ఫ్యాన్స్ మినహా అల వైకుంఠపురంలో విజయాన్ని ఎవరూ బన్నీకి ఇవ్వడంలేదు. ఇదంతా త్రివిక్రమ్ మాయ అని ఆయన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇది బన్నీ ఫ్యాన్స్ ని కొంచెం ఇబ్బందికి గురిచేస్తుంది. మా హీరో అవుట్ స్టాండింగ్ పరఫార్మెన్సు మరియు డాన్సులు చిత్ర విజయంలో కీలకం అని వారు అంటున్నారు. వాళ్ళు ఎంతగా వాదిస్తున్నా సోషల్ మీడియాలో మిగతా హీరోల ఫ్యాన్స్ మరియు మూవీ లవర్స్ అల వైకుంఠపురంలో సక్సెస్ క్రెడిట్ అంతా త్రివిక్రమ్ దే అని కౌంటర్లు ఇస్తున్నారు. ఇది ఇప్పుడు బన్నీ ఫ్యాన్స్ కి తలనొప్పిగా మారింది.