హైదరాబాదులోనే అత్యంత ఖరీదైన ఇల్లు ఇదే?

అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అలా వైకుంఠపురములో సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విషయాన్ని అందుకుంది. ఈ సినిమాతో పూజా హెగ్డేకు విపరీతమైన క్రేజ్ ఏర్పడిందని చెప్పాలి. ముఖ్యంగా ఈ సినిమాలోనీ పాటలు చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సాధారణంగా ఏదైనా సినిమా షూటింగ్ చేయాలంటే భారీ సెట్ వేయడం మనకు తెలిసిందే. ఇక ఈ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ గా అల్లు అర్జున్ ఇంటిని చూపించారు. ఈ ఇంటి కోసం హైదరాబాదులో భారీ సెట్ వేయాలని త్రివిక్రమ్ చెప్పారట. అయితే ఇంటి కోసం సెట్ కాకుండా నిజమైన ఇంటిలోనే చేయాలని అల్లు అర్జున్ సూచించారట. ఈ ఇంటి కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్ వేయాలని చెప్పగా అల్లు అర్జున్ ఈ ఇంటి గురించి వెల్లడించారు.

ఈ ఇల్లు ఎన్ టీవీ అధినేత నరేంద్ర చౌదరి గారి కుమార్తె అయిన రచన చౌదరి భర్త ఇల్లు. ఈ ఇల్లు ఖాళీగా ఉండటంతో అల్లు అర్జున్ సినిమా షూటింగ్ ఇంట్లో చేద్దామని త్రివిక్రమ్ శ్రీనివాస్ కి సూచించారట. ఇక అల్లు అర్జున్ సలహా మేరకు ఈ సినిమాని ఈ ఇంటిలో షూటింగ్ చేశారు. ఇక ఈ సినిమాలో ఇంద్ర భవనం లాంటి ఈ ఇల్లు ఎంతో హైలైట్ అయింది.ఇకపోతే ఈ ఇంటి కోసం చేసిన ఖర్చు తెలిస్తే ప్రతి ఒక్కరు ఆశ్చర్య పోవాల్సిందే.

హైదరాబాదులోని అత్యంత ఖరీదైన ఇళ్లల్లో ఈ ఇల్లు కూడా ఒకటి. చూడగానే ఇంద్ర భవనాన్ని తలపించేలా ఉన్నటువంటి ఈ ఇంటి కోసం ఏకంగా 400 కోట్ల రూపాయలు వరుకు ఖర్చు చేసి ఎంతో అందంగా నిర్మించారనీ సమాచారం. అయితే ప్రస్తుతం ఈ ఇంటికి సంబంధించిన ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక అల్లు అర్జున్ అలా వైకుంఠపురం సినిమా తర్వాత పుష్ప సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. త్వరలోనే ఈ సినిమా సీక్వెల్ చిత్రం పుష్ప 2 షూటింగ్ పనులను ప్రారంభించనుంది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus