గతేడాది సంక్రాంతికి వచ్చి… ఇంకా ప్రజల నోళ్లలో నానుతున్న సినిమా ‘అల వైకుంఠపురములో’. అల్లు అర్జున్ కెరీర్‌లో వచ్చిన బిగ్గెస్ట్ హిట్ ఇది. వసూళ్ల పరంగా, ప్రశంసల పరంగా సినిమా బన్నీకి బాగానే కలిసొచ్చింది. దర్శకుడు త్రివిక్రమ్ తన పెన్ను పవర్‌ను భలేగా చూపించారా సినిమాలో అని అభిమానులు ఆనందపడ్డారు. తమన్ సంగీతం సినిమాను ఎంతెత్తుకు తీసుకెళ్లిందో, ఆయన పేరునూ అంతే ఎత్తున నిలబెట్టింది. అంతలా సినిమాలో పాటలు ఆకట్టుకున్నాయి.
అందుకే యూట్యూబ్‌లో ఆ పాటకు అంత పేరొస్తోంది. ఆ సినిమాలో ‘రాములో రాముల..’ మరో అరుదైన ఘనతను సంపాదించుకుంది. యూట్యూబ్‌లో ఆ పాట వీడియో సాంగ్‌ను ఇప్పటివరకు 30 కోట్ల మందికిపైగా వీక్షించారు. లిరికల్ సాంగ్ ఇప్పటికే 34 కోట్ల మార్కును దాటేసిన విషయం తెలిసిందే. ‘అల వైకుంఠపురములో..’ పాటలు రికార్డులకు కేరాఫ్ అడ్రెస్ అని చెప్పొచ్చు. సినిమా విడుదలకు ముందు నుంచే ఈ పాటలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. విడుదల తర్వాత అది రెట్టింపు అయ్యింది.
‘సామజవరగమనా..’, ‘బుట్ట బొమ్మ..’, ‘రాములో రాముల..’ పాటలు ఇప్పటికే అన్ని స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో రిపీట్ మోడ్‌లో ఉంటున్నాయి. ‘బుట్ట బొమ్మ..’ పాట అయితే 53 కోట్ల వ్యూస్ ను దాటి 60 కోట్లవైపు దూసుకుపోతోంది. సామజవరగమనా వీడియో సాంగ్‌ను ఇప్పటివరకు 16 కోట్ల మందికిపైగా వీక్షించారు. ఈ పాట లిరికల్ సాంగ్‌ను 22 కోట్ల మంది వీక్షించారు. ‘సిత్తరాల సిరపడు’ పాటను అయితే 8.5 కోట్ల వ్యూస్ వరించాయి.
Most Recommended Video
ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?