అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘అల వైకుంఠపురములో’ చిత్రం ఫుల్ రన్ ముగిసింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం మొదటి షో తోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుని బన్నీ, త్రివిక్రమ్ లకు హ్యాట్రిక్ హిట్ ను అందించింది. పోటీగా ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి పెద్ద చిత్రం ఉన్నప్పటికీ.. అలాగే అనేక కొత్త సినిమాలు వచ్చినప్పటికీ.. తడబడకుండా.. తెలుగు రాష్ట్రాల్లో నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది.
ఇక ఫుల్ రన్ ముగిసేసరికి ‘అల వైకుంఠపురములో’ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :
నైజాం
44.88 cr
సీడెడ్
18.27 cr
ఉత్తరాంధ్ర
19.93 cr
ఈస్ట్
11.44 cr
వెస్ట్
8.96 cr
కృష్ణా
10.79 cr
గుంటూరు
11.18 cr
నెల్లూరు
4.72 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
11.85 cr
ఓవర్సీస్
18.35 cr
వరల్డ్ వైడ్ టోటల్
160.37 cr (share)
‘అల వైకుంఠపురములో’ చిత్రానికి 85 కోట్ల బిజినెస్ జరిగింది. విడుదలైన 6 రోజుల్లోపే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం.. ఫుల్ రన్ ముగిసేసరికి తెలుగు రాష్ట్రాల్లో…130.17 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. ఇక.. వరల్డ్ వైడ్ గా మొత్తం ..160.37 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా ఇప్పటివరకూ .. 256.36 కోట్లను కొల్లగొట్టింది. పాన్ ఇండియా రేంజ్లో విడుదల కాకపోయినప్పటికీ ఈ స్థాయిలో కలెక్షన్లను వసూల్ చేయడం అంటే మాటలు కాదు. అయితే ఫుల్ రన్లో 165 కోట్ల షేర్ ను వసూల్ చేస్తుంది అనుకుంటే.. ఆ ఫీట్ ను అందుకోలేకపోయింది.