గత ఏడాది పెద్దగా చప్పుడు చేయకుండా ‘ప్రేమలు’ అనే సినిమా వచ్చింది. మలయాళంలో అది ఒక ఇండస్ట్రీ హిట్ సినిమా. తర్వాత తెలుగులో కూడా డబ్ చేశారు. లేట్ గా డబ్ చేయడంతో తెలుగులో అది నిలబడదు అని అంతా అనుకున్నారు.కానీ తెలుగు వెర్షన్ రైటింగ్ బాగుండడంతో ఇక్కడి వాళ్ళకి కూడా బాగా నచ్చింది. మంచి వసూళ్లు సాధించి ఇక్కడ కూడా సూపర్ హిట్ అనిపించుకుంది. ఇక ఈ సినిమాలో హీరోగా చేసిన నస్లేన్ (Naslen) నటన తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా నటించింది. ఇప్పుడు ఇతని నుండి మరో సినిమా వచ్చింది. అదే ‘అలప్పుజ జింఖానా’ (Alappuzha Gymkhana ).
ఈ చిత్రానికి ఖలీద్ రెహ్మాన్ (Khalid Rahman) దర్శకుడు. మలయాళంలో ఏప్రిల్ 10న రిలీజ్ అయ్యింది ఈ సినిమా. తెలుగు వెర్షన్ నిన్న అంటే ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది కూడా పెద్దగా చప్పుడు లేకుండా వచ్చిన సినిమానే. అయితే మొదటి రోజు హిట్ టాక్ తెచ్చుకుంది. ఊహించని విధంగా ఓపెనింగ్స్ కూడా బాగానే నమోదయ్యాయి. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం | 0.19 cr |
సీడెడ్ | 0.05 cr |
ఆంధ్ర | 0.15 cr |
ఏపీ + తెలంగాణ(టోటల్) | 0.39 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ (తెలుగు వెర్షన్) | 0.04 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 0.43 cr |
‘జింఖానా’ (తెలుగు వెర్షన్) (Alappuzha Gymkhana ) బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.2.5 కోట్లు. మొదటి రోజు ఈ సినిమా రూ.0.43 కోట్లు షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.0.70 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.2.07 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది.